||ఏపీ అసెంబ్లీ||
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు అన్యాయం జరుగుతోందని టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నిన్న జరిగిన అసెంబ్లీలో స్పీకర్ కు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఆలస్యంగా రావడం వల్లే అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా నిర్వహించారని ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వకుండా తమను సస్పెండ్ చేశారని టీడీపీ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఆరోపించేందుకు అవకాశం ఇవ్వకుండా 12 మందిని సస్పెండ్ చేశారని తమకు న్యాయం జరగాలంటూ రెండవ రోజు అసెంబ్లీ సమావేశంలో గందరగోళం నెలకొంది. తమకు మాట్లాడేందుకు వీలు లేకుండా మైకు కూడా ఇవ్వకుండా తమనెందుకు సస్పెండ్ చేశారని టీడీపీ నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాము ని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కూడా సస్పెన్షన్ చేశారు. స్పీకర్ పై అసత్య ఆరోపణలు ప్రసంగిస్తే కఠిన చర్యలు తప్పవని సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిపై ఈ చర్యలు కొనసాగనున్నాయని స్పీకర్ తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నిర్మల రామానాయుడు లను కూడా ఈ సేషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మిగతా వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు పదే పదే అడ్డుకుంటునందుకు సస్పెండ్ చేశామని స్పీకర్ వెల్లడించారు.