||రేవంత్ రెడ్డి||
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేతుల మీదుగా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు హాజరయ్యారు. వారితో పాటు రేవంత్ రెడ్డి సతీమణి సహా ఇతర కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. అటు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటన విడుదల చేసింది.