వైఎస్ జగన్ ను వదలని షర్మిల.. సిగ్గు సిగ్గు జగన్ అంటూ మరో పోస్ట్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె సోదరీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల వదలడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, ప్రభుత్వ తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి మాత్రం తన అన్న జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు.

YS Sharmila, YS Jaganmohan Reddy

వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆమె సోదరీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వదలడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, ప్రభుత్వ తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి మాత్రం తన అన్న జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. ఢిల్లీలో తాము చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఆ పార్టీనే  అడగాలంటూ రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆదివారం ఆమె మరోసారి జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ ట్విట్టర్ వేదికగా భారీ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ఆమె ఏమన్నారంటే.. ' సిగ్గు సిగ్గు.!! మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు.! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం' అంటూ విమర్శలు గుప్పించారు. ఇంతకు మించిన పిరికితనం లేదంటూ ఎద్దేవా చేశారు. చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవని, వినపడవన్న షర్మిల.. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందంటూ ఆరోపించారు.

అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతున్నామన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, నెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని ఈ సందర్భంగా షర్మిల పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కావడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా..? అని షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి పెట్టారని విమర్శించారు. నిండు సభలో అధికారపక్షం శ్వేత పత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసిందని ఎద్దేవా చేశారు. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? అని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అని పేర్కొన్నారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడికి పోను అనే పిల్లాడికి టీసి ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీసుకు పోను అనే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తార,ని ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని షర్మిల స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవడికి కావాలని విమర్శించారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు. తాజాగా షర్మిల చేసిన పోస్ట్ రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్రంలో వైసిపి వర్సెస్ ప్రభుత్వం అన్న తీరుగా కాకుండా,  జగన్ వర్సెస్ షర్మిల అన్నట్టుగా ప్రస్తుతం వ్యవహారం సాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్