||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 2023 జనవరి 1 నాటికి అర్హులైనవారితో ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 39,84,868 మంది. అందులో మహిళా ఓటర్లు 2,02,19,104 మంది ఉండగా, పురుషులు 2,01,32,271 మంది ఉన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19,42,233 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం 7,29,085 మంది మాత్రమే ఉన్నారు.
ఓటరు తుది జాబితా వివరాలు:
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 3,99,84,868
మహిళా ఓటర్లు 2,02,19,104
పురుష ఓటర్లు 2,01,32,271
సర్వీసు ఓట్లు 68,162
ట్రాన్స్ జెండర్లు 3,924
అత్యధిక ఓట్లు ఉన్న జిల్లా - కర్నూలు
అత్యల్ప ఓట్లు ఉన్న జిల్లా - అల్లూరి