ఏపీలో వరదల నష్టం అంచనాకు కేంద్ర బృందం.. వెల్లడించిన అమిత్‌ షా

ఏపీలో వరదలు వల్ల గడిచిన కొద్దిరోజులు నుంచి తీవ్ర విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో నెలకొన్న వరదలు, ఇతర పరిస్థితులపై స్పందించారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ఏపీని ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే సాయం కోసం సిఫార్సులు చేసేందుకు నిపుణులు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు హోం మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు.

Union Home Minister Amit Shah

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 

ఏపీలో వరదలు వల్ల గడిచిన కొద్దిరోజులు నుంచి తీవ్ర విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో నెలకొన్న వరదలు, ఇతర పరిస్థితులపై స్పందించారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ఏపీని ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే సాయం కోసం సిఫార్సులు చేసేందుకు నిపుణులు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు హోం మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. కేంద్ర విపత్తు నిర్వహణశాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో నిపుణులతో కూడిన బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నిర్వహణ, రిజర్వాయర్‌ నిర్వహణ, డ్యామ్‌ భద్రత తదితరు అంశాలపై సిఫార్సులను చేస్తుందన్నారు. వరద బాధితుల సంఖ్య 6.44 లక్షలకు చేరువ కాగా, వీరిలో 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. ఎన్‌టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 63 వేల కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. 

జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ విమర్శలు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి విమర్శలు చేశారు. సినిమా వాళ్ల కంటే జగన్‌ దగ్గరే డబ్బు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమావాళ్లకు సంబంధించి హడావిడి తప్పా ఏమీ ఉండదని, జగన్‌ లాంటి వాళ్ల కంటే ఫిల్మ్‌ ఇండస్ర్టీకి చెందిన వారి దగ్గర డబ్బు ఏమీ ఎక్కువ ఉండదన్నారు. వరద బాధితులకు సహాయం అందించడానికి చాలా మంది ముందుకు రావడం మంచి పరిణామంగా ఆయన పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన డబ్బును బాధితులు కోసం పారదర్శకంగా ఖర్చు చేస్తామని వెల్లడించారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్