విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించిన ఆయన.. ఇద్దరు సీఎంల బేటి సారాంశాన్ని రహం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు
విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమావేశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించిన ఆయన.. ఇద్దరు సీఎంల బేటి సారాంశాన్ని రహం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ కుడి కెనాల్ కు నీళ్లు ఇవ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు, ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరిందని, కోర్టులో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగిందన్నారు. చంద్రబాబు ఈ విషయాలపై ప్రజలకు స్పష్టతను ఇవ్వాలని, ఏపీ ప్రజలకు ఎటువంటి ద్రోహాన్ని చంద్రబాబు చేయబోతున్నారో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చంద్రబాబు చెబుతున్నారు అంటే అర్థమేంటని, తెలంగాణ డిమాండ్లను చంద్రబాబు అంగీకరించినట్లేనా అని రాంబాబు ప్రశ్నించారు. నాగార్జునసాగర్ లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయని, వాటి మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదంటూ అంబటి రాంబాబు విమర్శించారు.
వైఎస్ జగన్ వల్లే పోలవరం విషయంలో చత్తీష్ఘడ్,ఒడిస్సాతో వివాదాల పరిష్కారం అయ్యాయన విషయాన్ని గుర్తించాలన్నారు. పోలవరం విషయంలో ఏపీకి ద్రోహం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని, కాంట్రాక్టర్లు మార్చడం, రివర్స్ టెండర్రింగ్ తో పోలవరం ఆలస్యం కాలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నది మధ్యలో కాపర్ డ్యామ్ కట్టడం వల్లే పోలవరం ఆలస్యానికి కారణమని అంబటి రాంబాబు వివరించారు. రాష్ట్ర విభజన వలన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన జరిగిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయున్న విషయాన్ని గుర్తించాలన్నారు. 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండేదని, అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పు చేయడం వల్లే మెడ పట్టుకుని గెంటేసారని, రాష్ట్రానికి రావాల్సినది ఏది తీసుకొని రాకుండా ఎందుకు పారిపోయారన్నారు. తెలంగాణలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏపీకే అన్యాయం చేశారన్నారు. ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయని, చంద్రబాబు వ్యక్తిగత అంశాల కోసం ఏపీకి చెందిన గ్రామాలను తెలంగాణలో కలిపేస్తారా..? అంటూ ప్రశ్నించారు. అసలు ఇద్దరు సీఎంల మధ్య సమావేశాలు జరిగితే దేని గురించి చర్చించారన్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. చర్చలను రహస్యంగా ఉంచడానికి కారణం ఏమిటని, రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే అని చంద్రబాబు అనడం వెనక కుట్ర ఏంటో బయట పెట్టాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు ఇంకా మాట్లాడుతుండడం దురదృష్టకరమన్నారు.