సీఎం రేవంత్ రెడ్డి మెడకు అదానీ కుంభకోణం వ్యవహారం..!

న్యూయార్క్‌లో అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మిస్ ఫైర్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు సొంత పార్టీకే తాకుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను బీఆర్ఎస్ బయటపెడుతోంది.

adani revanth reddy

ఫైల్

హైదరాబాద్, ఈవార్తలు : న్యూయార్క్‌లో అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మిస్ ఫైర్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు సొంత పార్టీకే తాకుతున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను బీఆర్ఎస్ బయటపెడుతోంది. దీనికి సమాధానాలు ఎవరు చెప్తారంటూ.. పలు అంశాలను ప్రస్తావిస్తోంది. దావోస్ పర్యటనలో అదానీతో రేవంత్ రెడ్డి రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకుందని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశ్నించారు. ‘అదాని అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ అంటున్నాడు.. అదే నిజమైతే, అదానీ నుంచి రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు? దావోస్ పర్యటనలో ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు?’ అని ప్రశ్నించారు. మరోవైపు, మీడియా సమావేశంలో రాహుల్ గాంధీని ఓ మీడియా ప్రతినిధి దావోస్ ఒప్పందాలపై ప్రశ్నించగా.. ఎవరెవరు ఈ కుంభకోణంలో ఉన్నారో.. వాళ్లంతా అరెస్టు కావాల్సిందేనని రాహుల్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం.. అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ఆరా తీసినట్లు సమాచారం. దావోస్ ఒప్పందం.. రూ.100 కోట్ల విరాళం అంశాల వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ రెండు అంశాలు అదానీపై పోరాడే క్రమంలో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అభిప్రాయపడ్డట్లు సమాచారం. రేవంత్ తీసుకున్న నిర్ణయాలు.. చేసుకున్న ఒప్పందాలు ఒక విధంగా పార్టీకి నష్టం చేకూర్చేవేనని పలువురు స్థానిక పార్టీ నేతలు కూడా పేర్కొంటున్నారు. అదానీపై పోరాటాన్ని ఉధృతం చేయాల్సి ఉండగా, రేవంత్ సర్కారు చర్యలు అవరోధంగా మారినట్లు గుసగుసలాడుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్