సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులందరూ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 21 మంది మంత్రుల్లో 22 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. పుంగనూరు నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు.
మంత్రులు ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు
సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులందరూ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 21 మంది మంత్రుల్లో 22 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. పుంగనూరు నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఓడిపోయిన వారిలో అంబటి రాంబాబు, అంజాద్ భాష, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లిబోయిన వేణు, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కారుమూరు నాగేశ్వరరావు, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, కొట్టు సత్యనారాయణ, వినిపే విశ్వరూప్, విడుదల రజని, ఆర్కే రోజా, శ్రీదిరి అప్పలరాజు, ఉషశ్రీ చరణ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేరుగ నాగార్జున, బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర ఉన్నారు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్లు కోన రఘుపతి, కోలగట్ల వీరభద్ర స్వామి కూడా పరాజయం పాలయ్యారు. మాజీ మంత్రులు కూడా అనేక నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు. ఈ జాబితాలో కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, పుష్పశ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావుతోపాటు మరో 15 మంది మాజీ మంత్రులు పరాజయం పాలయ్యారు.