Kangana Ranaut | కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన మహిళా కానిస్టేబుల్

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిందో మహిళా కానిస్టేబుల్. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుందీ ఘటన.

kangana ranaut

కంగనాపై మహిళా కానిస్టేబుల్ దాడి

చండీగఢ్‌, ఈవార్తలు: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిందో మహిళా కానిస్టేబుల్. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుందీ ఘటన. విమానాశ్రయంలో భద్రత తనిఖీ చేశాక బోర్డింగ్ గేట్ వద్దకు వెళ్తున్న టైంలో కుల్వీందర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనా చెంపపై కొట్టింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ధర్నాను గతంలో కంగనా ఖలీస్థానీల ధర్నా అని అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహంతోనే కానిస్టేబుల్ దాడి చేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై కంగనా, సీఐఎస్ఎఫ్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని కంగనా రనౌత్ భావిస్తున్నట్లు తెలిసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్