ఏపీలో 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దు

ఏపీలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు భారీగా రద్దయ్యాయి. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి.

job cards cancelled in AP

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ, డిసెంబర్ 19 (ఈవార్తలు): ఏపీలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు భారీగా రద్దయ్యాయి. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా జాబ్ కార్డులు రద్దు కావటం గమనార్హం. ఇక అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కాలంలో ఏపీలో 11.07 లక్షల జాబ్ కార్డులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. కేవలం ఐదు వారాల వ్యవధిలోనే 11 లక్షల జాబ్ కార్డులను అధికారులు ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారు. ఈ ఐదు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 16.31 లక్షల జాబ్ కార్డులు రద్దు కాగా.. అందులో 11 లక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావటం గమనార్హం. దేశవ్యాప్తంగా రద్దు అయిన కార్డులలో 68 శాత ఏపీవే. మరోవైపు ఈ ఐదు నెలల కాలంలో మిగతా రాష్ట్రాలలో కనీసం లక్ష జాబ్ కార్డులు కూడా రద్దు కాలేదు. కానీ ఏపీలో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలుగా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 95,084, ఒడిశా 80,896, జమ్మూకశ్మీర్ 79,070 జాబ్ కార్డులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్