కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తి.. కీలక హామీలు అమలపై కొరవడిన స్పష్టత

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని జనసేన, బిజెపితో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో చాలావరకు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యంత అనుభవం ఉన్న, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తారని అంతా భావించారు.

Super Six guarantees

సూపర్ సిక్స్ హామీలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని జనసేన, బిజెపితో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో చాలావరకు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యంత అనుభవం ఉన్న, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన కక్షపూరిత రాజకీయాలను అవలంబించడం విస్మయాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. రాజకీయంగా బలోపేతం కావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తుండడం సర్వత్ర విష్మయాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించడం, గత ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలను వెతికే పనిలోనే ప్రభుత్వం ఉండడం కొన్ని వర్గాల నుంచి విమర్శలు రావడానికి కారణం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయ తరహా పాలన సాగిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను తప్పుపట్టేలా ప్రతిరోజు విమర్శలు చేయడంతోపాటు ఆ పార్టీ నాయకులను అరెస్టు చేయడం, జైల్లో వేయడం వంటివన్నీ కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటున్నారు. ఒకరకంగా ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తున్నారంటూ చెబుతున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో కూడా కూటమి నాయకులు శ్రద్ధ చూపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై సంతకాన్ని చేశారు. వంద రోజులు పూర్తవుతున్న ఈ ప్రక్రియ ఇప్పటికే ముందుకు సాగడం లేదని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి వీలైనంత వేగంగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నారు. అలాగే మరో కీలకమైన హామీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం. ఈ పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో అన్న స్పష్టత ప్రభుత్వం నుంచి ఎప్పటికీ రాలేదు. రాష్ట్రంలోని లక్షలాదిమంది మహిళలు ఈ పథకం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం గురించి ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ.. స్వస్థత రావాల్సి ఉంది. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మహిళలకు ప్రతినెల 1500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హామీ కూటమి అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా పనిచేసింది. ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తుందో అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం కనీసం చెప్పడం లేదు. ఈ పథకం గురించి చర్చించేందుకు కూడా కూటమి నాయకులు అంగీకరించడం లేదు. ఇది కూడా కొంత విమర్శలకు కారణమవుతోంది. అలాగే రైతులకు ఏటా 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కూడా పూర్తయింది. ఇప్పటివరకు ప్రభుత్వం రూపాయి కూడా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా సాయాన్ని కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక హామీలు అమలు చేయడంలో ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ కక్షపూరిత రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తున్నారని వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విమర్శల నుంచి బయట పడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అనుభవాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతోపాటు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా అడుగులు వేస్తారో లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్