ఏపీలో కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తి.. రేపటి నుంచి ప్రజల్లోకి ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయింది. కూటమిలో తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన, బిజెపి భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి 164 స్థానాల్లో విజయాన్ని దక్కించుకున్నాయి. అనంతరం ప్రభుత్వాన్ని మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేశాయి. గురువారం నాటికి కూటమి ప్రభుత్వం వంద రోజులను పూర్తి చేసుకుంది. 100 రోజుల పాలనలో అనేక అవరోధాలను అధిగమించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Chandrababu speaking at 100 meeting

వంద రోజులు సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయి మెజారిటీతో ఆయన అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఐదేళ్లు కూడా పూర్తికాకుండానే అధికారాన్ని అత్యంత దారుణ రీతిలో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పాటు అయింది. ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన, బిజెపి భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి 164 స్థానాల్లో విజయాన్ని దక్కించుకున్నాయి. అనంతరం ప్రభుత్వాన్ని మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేశాయి. గురువారం నాటికి  కూటమి ప్రభుత్వం వంద రోజులను పూర్తి చేసుకుంది. 100 రోజుల పాలనలో అనేక అవరోధాలను అధిగమించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 100 రోజుల పాలన నేపథ్యంలో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వంద రోజులు ప్రగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి, తీసుకోబోయే నిర్ణయాలను గురించి చర్చించారు.

ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఊపిరి పోయడంతోపాటు వరదల్లో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వంలో చేసిన తప్పులను వెలికితీస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్రం వికసిత్ భారత్ కు నాంది పలికిందని, స్వర్ణాంధ్రప్రదేశ్-2047కు విజన్ డాక్యుమెంట్ ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ఇసుకకు సంబంధించి నూతన విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 17వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక టాస్క్ విధించారు. రాష్ట్రంలో ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రానున్న పది రోజులు ప్రజల్లోనే ఉండేలనీ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాలను తెలుసుకోవడంతోపాటు వారి ఇబ్బందులు గుర్తించి వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించి ఎమ్మెల్యేలకు అందించనున్నారు. ఈ పది రోజులపాటు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండి వంద రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంపై ప్రణాళికల రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే ప్రభుత్వంపై వంద రోజుల్లో కొన్ని అంశాలపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతపై దాడులు చేయడం, అరెస్టులు చేయడం వంటి వాటిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.  అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. కీలక హామీలను కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో అని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఎదురుచూస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్