పెళ్లి చేసుకునే వారికి శుభవార్త.. 2025లో పెళ్లి ముహూర్తాలు ఇవే..

వివాహం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కోసం చేసుకునే పండుగ. పెండ్లి అనేది చాలా పవిత్రమైనది. ఇది ఇద్దరు వ్యక్తులు కలిసి జంటగా మారడమే కాదు.. జీవిత పయనంలో రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా ప్రయాణించడం. అలాంటి ఈ పండుగను జరుపుకోవాలంటే హిందువుల ప్రకారం కచ్చితంగా మంచి రోజు, మంచి గడియ చూస్తారు. అందుకే జ్యోతిషశాస్త్రం ప్రకారం వివాహానికి మంచి ముహూర్తం చూసుకుంటారు.

marriage dates

ప్రతీకాత్మక చిత్రం

వివాహం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కోసం చేసుకునే పండుగ. పెండ్లి అనేది చాలా పవిత్రమైనది. ఇది ఇద్దరు వ్యక్తులు కలిసి జంటగా మారడమే కాదు.. జీవిత పయనంలో రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా ప్రయాణించడం. అలాంటి ఈ పండుగను జరుపుకోవాలంటే హిందువుల ప్రకారం కచ్చితంగా మంచి రోజు, మంచి గడియ చూస్తారు. అందుకే జ్యోతిషశాస్త్రం ప్రకారం వివాహానికి మంచి ముహూర్తం చూసుకుంటారు. అయితే ఇప్పుడు రాబోతున్న సంవత్సరం అంటే.. 2025 లో శుభప్రదమైన తేదీలు, ముహూర్తాలు ఎలా ఉన్నాయో, ఏ నెలలో ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాలు, నక్షత్రాలు, పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో వివాహానికి చాలా అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఈ తేదీలు వైవాహిక జీవితాన్ని విజయవంతం చేయడానికి మాత్రమే కాకుండా కొత్తగా పెళ్లయిన జంటల జీవితం పరస్పర ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా సాగేలా చేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సాధారణంగా వధూవరుల జాతకాలను అంటే వారి పుట్టిన తేదీ, తిథి లాంటివి పరిశీలించిన తర్వాతే అనుకూలమైన తేదీని పెళ్లి ముహూర్తంగా నిర్ణయిస్తారు. ఈ తేదీల్లో వివాహం ఏ వ్యక్తికి అయినా శుభం కలుగజేస్తుందని పండితులు చెబుతున్నారు. మరి 2025 సంవత్సరంలో ఏ నెలలో ఏ తేదీలు పెళ్లి ముహూర్తాలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందాం.

జనవరి 2025లో వివాహానికి అనుకూలంగా ఉన్న కొన్ని తేదీలు ఉన్నాయి. ఈ నెల మకర సంక్రాంతికి ముందు రోజులను పీడదినాలు అంటారు. ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యలు చేసుకోరు. మకర సంక్రాంతి తర్వాత వివాహ ముహూర్తాలు మొదలవుతాయి. జనవరి 16, 17, 18, 19, 21, 22, 24 పెళ్లి వేడుకలకు అత్యంత అనుకూలమైన తేదీలు.

ఫిబ్రవరి 2025లో వసంత పంచమి పండుగ రోజు వివాహం చేసుకోవడం శుభప్రదంగా చెబుతారు. మాఘమాసం వచ్చిన ఐదో రోజు వచ్చే శుభదినం వసంత పంచమి. దీంతో పాటు ఫిబ్రవరి 7, 13, 14, 15, 18, 19, 20, 21, 25 తేదీలు ఉత్తమమైనవి.

మార్చి నెలలో చలి తగ్గి ఎండలు మొదలయ్యే సమయం. ఈ నెల 1, 2, 6, 7, 12 తేదీలు అనుకూలమైనవి.

ఏప్రిల్ నెల వివాహానికి చాలా పవిత్రమైనదిగా పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ పండుగ ఈ నెలలోనే ఏప్రిల్ 30న వస్తుంది. అక్షయ తృతీయ రోజున శుభ ముహూర్తాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం లేకుండా వివాహం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ నెలలో వివాహానికి 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.

మే నెలలో తేదీలు 1, 5, 6, 8, 15, 17, 18 తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.

జూన్ 1, 2, 4, 7వ తేదీలను వివాహానికి అనుకూల సమయాలుగా పండితులు గుర్తించారు. ఈ రోజుల్లో వివాహం చేసుకోవడం వల్ల వైవాహిక జీవితంలో శ్రేయస్సు, సంతోషం ఉంటుందని వారు చెబుతున్నారు.

జూలై 2025 నుండి అక్టోబర్ 2025 వరకు వివాహానికి ముహూర్తాలు లేవు. ఆ సమయంలో విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడట. అందువల్ల ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకోరు. 

నవంబర్ నెలలో 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30 తేదీలు వివాహం చేసుకోవడం శుభప్రదం. మీరు ఈ తేదీల శుభ సమయాన్ని తెలుసుకొని ముహూర్తాలు చేసేకోవచ్చు.

డిసెంబర్‌లో పెళ్లికి కొన్ని ప్రత్యేక తేదీలు ఉన్నాయి. ఈ నెలలో 4, 5, 6వ తేదీలు వివాహానికి సానుకూల శక్తిని అందిస్తాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్