ప్రతిరోజు యాలకులను నోట్లో వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక అనారోగ్య సమస్యలతో పాటు నోటి దుర్వాసన సమస్య నుంచి కూడా యాలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. యాలకులు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే కొంతమంది మాత్రం యాలకులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వారికి యాలకులు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాలకులు ఎటువంటి వారు తినకూడదు అన్న విషయాలు మీకోసం. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండాను అడ్డుకుంటాయి.
యాలకులు
ప్రతిరోజు యాలకులను నోట్లో వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక అనారోగ్య సమస్యలతో పాటు నోటి దుర్వాసన సమస్య నుంచి కూడా యాలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. యాలకులు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే కొంతమంది మాత్రం యాలకులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వారికి యాలకులు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాలకులు ఎటువంటి వారు తినకూడదు అన్న విషయాలు మీకోసం. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండాను అడ్డుకుంటాయి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. యాలకుల్లో ఉండే ఇలాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధులు బారిన పడకుండా కాపాడతాయి. అన్నం తిన్న తర్వాత రెండు యాలకులను నోట్లో వేసుకుంటే చాలు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటపాలిజం రేటును మెరుగుపరుస్తాయి.
నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. యాలకులను ఆహారంలో భాగం చేసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ యాలకులు ఎంతగానో దోహదం చేస్తాయి. యాలకుల్లో ఉండే కీలక విటమిన్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్.. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపించి మెరిసిపోయేలా చేస్తాయి. వంట గదిలో లభించే ఈ సుగంధ ద్రవ్యంలో సోడియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిని కలిగించే ఈ యాలకులను కొంతమంది తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కిడ్నీలో రాళ్లు సమస్య ఉన్నవారు యాలకులు తీసుకోవడం మానుకోవాలి. యాలకులు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. అందువల్ల గర్భధారణ సమయంలో వీటిని తినడం మానేయడం మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు యాలకులు ఎక్కువగా తినకూడదు. కొన్నిసార్లు ఎక్కువగా వీటిని తినడం వల్ల కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడి మచ్చలు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.