ఈ యోగాసనాలతో బరువు తగ్గే అవకాశం.. మీరు ట్రై చేయండి.!

యోగ.. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. యోగా వల్ల శారీరక ఫిట్నెస్ కూడా లభిస్తుంది. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అయితే యోగ రోజు చేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు కొన్నిరకాల యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉత్తనాసనం రెగ్యులర్గా వేయడం ద్వారా కాళ్లు, చేతులు బలంగా మారతాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

యోగ.. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. యోగా వల్ల శారీరక ఫిట్నెస్ కూడా లభిస్తుంది. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అయితే యోగ రోజు చేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు కొన్నిరకాల యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉత్తనాసనం రెగ్యులర్గా వేయడం ద్వారా కాళ్లు, చేతులు బలంగా మారతాయి. శరీరానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉత్కటాసనం వేయడం ద్వారా కాళ్లు, చేతులు, వెన్నెముక కండరాలు స్ట్రెచ్ అవుతాయి. అలాగే కండరాలు బలంగా మారుతాయి. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. సేతు బండాసనం వేయడం ద్వారా నటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో క్యాలరీలు తొందరగా ఖర్చవుతాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే బరువు తగ్గేందుకు ఉపయోగపడే మరో ఆసనం వీరభద్రాసనం. ఈ ఆసనం రోజువారి వేయడం ద్వారా కాళ్లు, చేతులు, వెన్నుముక కండరాలు బలంగా మారతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మెటబాలిజం రేటు పెరిగి క్యాలరీల ఖర్చు అధికం అవుతుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

అలాగే బరువు తగ్గేందుకు ఉపయోగపడే మరో ఆసనం భుజంగాసనం. ఈ ఆసనాన్ని రోజు వేయడం ద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాళ్లు, చేతి కండరాలు స్ట్రెచ్ అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజు నావాసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పొత్తికడుపు, వెన్నెముక, కాళ్లు, చేతి కండరాలు బలంగా మారతాయి. సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలంటే బాగా ఉపయోగపడే మరో ఆసనం ప్లాంక్ పోజ్. ప్లాంక్ పొజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు చేయడం వల్ల బాడీ కండరాలు ఫిట్ గా, బలంగా మారతాయి. బరువు తగ్గే రేటు పెరుగుతుంది. అదోముక స్వనాసనం కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనం రోజు వేయడం ద్వారా కండరాలు బలంగా మారుతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. అలాగే పరిశుభ్రత ఉత్కటాసనం. ఈ ఆసనం వల్ల వెన్నెముకను ట్విస్ట్ చేసి ఈ ఆసనం వేస్తారు. ఈ ఆసనం వేయడం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరం నుంచి విషపదార్థాలు బయటకు పోతాయి. ద్వారా బరువు తగ్గుతారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్