మహిళలూ ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకండి.. రొమ్ము క్యాన్సర్ కావచ్చు

నేటికాలం మహిళలు బిజీలైఫ్ కారణంగా ఆరోగ్యంపై అశ్రద్ధ చూపిస్తున్నారు. మీ రొమ్ములో ఈ లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

cancer

ప్రతీకాత్మక చిత్రం 

Breast Cancer | చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధి ఎవరినీ వదట్లేదు. శరీరంలో అసాధారణ కణాలు పెరిగి ప్రతిచోటా వ్యాపించడాన్ని క్యాన్సర్ అంటారు. ఈ అసాధారణ కణాలు కణితులను ఏర్పరిచి..ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతాయి. ఇది ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, కొన్ని కారణాలను గుర్తించవచ్చు. వీటిలో ధూమపానం, అధిక మద్యపానం, సరైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, క్యాన్సర్ కారకాలకు గురికావడం, జన్యుశాస్త్రం, కొన్ని ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. ఈ కారకాలన్నింటినీ గుర్తించడం చాలా ముఖ్యం. మహిళల్లో క్యాన్సర్ వచ్చే ఐదు అసాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. మహిళల రొమ్ము భాగంలో కొన్ని లక్షణాలు కనిపించినట్లయితే దానిని క్యాన్సర్ గా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలేంటో చూద్దాం. 

ఫైబ్రోసిస్టిక్ మార్పులు:

హార్మోన్ల మార్పుల వల్ల మన శరీరంలో మార్పులు వస్తాయి. వీటి కారణంగా రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. వీటిని ఫైబ్రోసిస్టిక్ అంటారు. హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే కణితుల వల్ల క్యాన్సర్ రాదు. రొమ్ము హార్మోన్ల మార్పులతో మారుతుంటాయి. ఈ రకమైన రొమ్ము గడ్డలు రొమ్ములోపల ఓ ముద్దలా కనిపిస్తుంటాయి. వాటిని తాకుతుంటే గడ్డలుగా అనిపిస్తాయి. రొమ్ము కణితులు ప్రమాదకరం కారనప్పటికీ..అవి ఇబ్బందికరంగా మారుతుంటాయి. 

ఫైబ్రోడెనోమాస్:

ఇది రొమ్ము కణితి. ఇవి రొమ్ములోని ముద్దలు. తాకినప్పుడు కలుతుంటాయి. గుండ్రంగా ఉంటాయి. తాకినప్పుడు మెత్తగా అనిపిస్తాయి. ఈ కణితులు సాధారణంగా యువతుల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా 20ఏండ్ల బాలికల్లో ఇవి సర్వసాధారణమని నిపుణులు అంటున్నారు. నొప్పిలేని గడ్డలుకనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవడం ముఖ్యం. 

చాలా  మంది రొమ్ములో గడ్డలుగా కనిపించినప్పుడు బాధపడుతుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లకముందే క్యాన్సర్ అని భయపడుతుంటారు. ఇలాంటివి మానసికంగా బలహీనపరిచి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. రొమ్ములో గడ్డలని గమనిస్తే..వెంటనే డాక్టర్ ను కలిసి  చెకప్ చేసి ట్యూమర్ ఏంటో తెలుసుకుని చికిత్స తీసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్