చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు తర్వాత దగ్గు, దగ్గు తర్వాత జ్వరం ఇలా ఒకటి తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటితో పాటు చలికాలంలో కచ్చితంగా వచ్చే మరో సమస్య మడమల పగుళ్లు.
ప్రతీకాత్మక చాత్రం
చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు తర్వాత దగ్గు, దగ్గు తర్వాత జ్వరం ఇలా ఒకటి తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటితో పాటు చలికాలంలో కచ్చితంగా వచ్చే మరో సమస్య మడమల పగుళ్లు. ముఖ్యంగా చలికాలంలో మడమల పగుళ్ల వల్ల ఆడవాళ్లే ఎక్కువగా ఇబ్బంది పడతారు. మడమల పగుళ్లు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ దీనివల్ల పాదాల్లో విపరీతంగా నొప్పి పుడుతుంది. దీనివల్ల నడవటం కూడా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పగుళ్లు ఎక్కువగా ఉంటే వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. పాదాల పగుళ్లు సాధారణంగా పొడి చర్మం, మధుమేహం వ్యాధి ఉండేవారికి చలికాలంలో బాధ వర్ణణాతీతం. శరీరంలో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కవసేపు నిలబడి పని చేయడం, కఠిన నేలపైన నడవడం, ఎత్తైన చెప్పులు ధరించి నడవడం, అధిక బరువు కలిగి ఉండటం, పోషక ఆహార లోపం కాళ్ల పగుళ్లకు కారణాలు. కాళ్ల పగుళ్ల నుంచి కొన్ని టిప్స్ పాటించి ఇంట్లోనే నివారించుకోవచ్చు.
పాదాల పగుళ్ల నివారణ ఇలా..
గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి పాదాలను 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత పొడి గుడ్డతో తడి లేకుండా తుడుచుకోవాలి.
రాత్రి పడుకునే ముందు వెన్న లేదా వాజిలన్ రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి.
తేనె మంచి యాంటిసెప్టిక్. ఒక స్పూన్ తేనెలో అర స్పూన్ నిమ్మరసం కలిపి పాదాలకు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల రిలీఫ్ ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో పాదాలను బాగా మర్దన చేసి ఉదయం స్నానం సమయంలో రుద్ది కడగాలి. కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయాల్ గుణాలు పగుళ్లను తగ్గిస్తాయి.
పాదాల పగుళ్లను నివారించే చెప్పులను వేసుకోవడం మేలు. ముఖ్యంగా హై హీల్స్ వేసుకోకూడదు.