(Pic: ప్రతీకాత్మక చిత్రం)
Winter Health Problems : చలికాలం రాగానే చాలా మంది ముక్కులు కారుతుంటాయి. దగ్గులు మొదలవుతాయి. తుమ్ములు తుమ్ముతుంటారు. ఎవరిని కదిలించినా అదే పరిస్థితి. చిన్న పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల దాకా ఇదే తంతు. రోగాల యుద్ధం చేసే రోగ నిరోధక వ్యవస్థ పనిచేయదా? పనిచేసినా ఎందుకు రోగాలు వస్తున్నాయి? అని శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా అసలు నిజం బయటపడింది. ముక్కులోని రోగనిరోధక స్పందనను శీతల ఉష్ణోగత కప్పిపెట్టి ఉంచతుందని, దాంతో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు ఆగిపోయి జలుబు, దగ్గు, ఇతర ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు వస్తాయని మాస్ ఐ అండ్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన అధ్యయనం డిసెంబర్ 6న ది జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీలో పచరితమైంది.
బయటి వాతావరణానికి, అంతర్గత శరీరానికి పధానంగా అనుసంధానమై ఉండేది ముక్కు. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఉండే రేణువులు, ఇతర బ్యాక్టీరియాలు ముక్కు ద్వారా లోపలికి వెళ్తాయి. చలికాలంలో ముక్కులో ఉండే రోగ నిరోధక వ్యవస్థ స్పందించకపోవడం వల్ల అవి నేరుగా ఊపిరితిత్తులకు చేరి, కణాల పభావం చపుతాయి. తద్వారా శ్వాస సంబంధ వ్యాధులకు కారణం అవుతాయి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు