లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో బీరువా లోపల ఏమేం పెట్టుకోవాలంటే..

మన ఇంట్లో విలువైన వస్తువులను బీరువాలోనే దాచుకుంటాం. అంటే డబ్బులు కానీ, బంగారం కానీ, విలువైన డాక్యుమెంట్లు కానీ పెట్టుకుంటాం. అసలు బీరువా లోపల ఏమేం దాచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది? అన్నది తెలుసుకుందాం.

beeruva at home

ప్రతీకాత్మక చిత్రం

మన ఇంట్లో విలువైన వస్తువులను బీరువాలోనే దాచుకుంటాం. అంటే డబ్బులు కానీ, బంగారం కానీ, విలువైన డాక్యుమెంట్లు కానీ పెట్టుకుంటాం. అసలు బీరువా లోపల ఏమేం దాచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది? అన్నది తెలుసుకుందాం. అందరు కూడా బీరువాను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉత్తరం దిక్కు వైపు బీరువాను ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఉత్తరం దిక్కు కుబేర స్థానం కబట్టి ఉత్తరం దిక్కు బీరువా ఉంచుకుంటే మంచిదని ఉత్తరం దిక్కు బీరువాను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే బీరువా లోపల ఉండే వస్తువులను బట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే బీరువా లోపల రెడ్ క్లాత్ అంటే ఎర్రని వస్త్రం పరిస్తే ధనం రావటం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా బీరువా లోపల రెడ్ క్లాత్ ఉంచకండి. ఎలాంటి క్లాత్ ఉంచాలంటే ధనం దాచే చోట తెల్లటి కాటన్ వస్త్రం ఉంచాలి. ఆ తెల్లటి కాటన్ వస్త్రానికి అత్తరు రాయాలి. అత్తరు అనేది సుగంధద్రవ్యం, దానికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి అధిష్ఠాన దేవత లక్ష్మీదేవి. కనుక అత్తారు తెల్లటి కాటన్ వస్త్రానికి రాసి పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

అలాగే బీరువాలో గోవింద నామాల పుస్తకం ఉంటే మంచిది. లక్ష్మీ అష్టోత్తరం ఉంటే మంచిది. అందుకే ఎవరైనా సరే బీరువాలో డబ్బులు దాచే చోట గోవింద నామాల పుస్తకం కానీ, అష్టోత్తర పుస్తకం కానీ ఉంచడం మంచిది. ఇలా చేయడం వలన లక్ష్మీ దేవి సాక్షాత్తు మీ ఇంట్లో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. అలాగే బీరువాలో డబ్బులు దాచిపెట్టుకునేప్పుడు ఒక వైపు నోట్లు, మరో వైపు చిల్లర దాచిపెట్టుకోవాలి, ఒక వైపు బంగారం దాచిపెట్టుకోవాలి. ఇలా విడివిడిగా నోట్లు, బంగారం, చిల్లర దాచిపెట్టుకుంటే లక్ష్మీ దేవి విశేషమైన అనుగ్రహం దక్కుతుంది. ఇవి దాచిపెట్టిన చోట కర్పూరం ఉంచితే చాలా మంచిది. కర్పూరం మాత్రమే కాకుండా మీకు వీలైతే బీరువా లోపల డబ్బు, బంగారం, నాణాలు ఉంచిన చోట ఒక వెండి పాత్ర కానీ, రాగి పాత్ర కానీ ఉంచండి. ఆ పాత్రలో పచ్చకర్పూరం లేదా వట్టివేలు ఉంచితే చాలా మంచిది. లక్ష్మీదేవికి వట్టివేలు అంటే చాలా ఇష్టం. ఇలా ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్