ice cream vs frozen dessert | బేకరీకి.. షాప్‌కు వెళ్లి ఐస్ క్రీం కొనుకుంటున్నారా? అక్కడ ఫ్రిజ్‌లో ఉన్నవన్నీ ఐస్ క్రీమ్స్ అనుకుంటున్నారా? ఐస్ క్రీం కప్స్‌లాగే ఉన్నా, అన్నీ ఐస్ క్రీమ్స్ కావన్న విషయాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం.
Ice Cream vs Frozen Dessert | బేకరీకి.. షాప్‌కు వెళ్లి ఐస్ క్రీం కొనుకుంటున్నారా? అక్కడ ఫ్రిజ్‌లో ఉన్నవన్నీ ఐస్ క్రీమ్స్ అనుకుంటున్నారా? ఐస్ క్రీం కప్స్‌లాగే ఉన్నా, అన్నీ ఐస్ క్రీమ్స్ కావన్న విషయాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే మన ఆరోగ్యానికే హానికరం. ఘనీభవించిన డిజర్ట్ (Frozen dessert) అమ్మి.. వాటిని ఐస్ క్రీమ్స్ అని చెప్పే ప్రమాదం ఉంది జాగ్రత్త. రెండూ సేమ్‌గానే ఉంటాయి.. తేడా ఏంటి? అనుకుంటున్నారా? పాలు, క్రీమ్, గుడ్లు, చక్కెర, వెనీలా సారం, ఇతర రుచుల పాల ఉత్పత్తుల నుంచి ఐస్ క్రీమ్స్ తయారవుతాయి. అదే ఫ్రోజెన్ డిజర్ట్స్ మాత్రం కూరగాయల నూనె (Vegetable Oils), పిండి, చక్కెరతో తయారు చేస్తారు. చూడ్డానికి సేమ్ ఐస్ క్రీమ్స్‌లాగే ఉంటాయి. ఎడిబుల్ వెజిటెబుల్ ఆయిల్ లేదా కొవ్వుతో తయారుచేసే పాశ్చరైజ్డ్ మిశ్రమమే ఇది.
ఫ్రోజెన్ డిజర్ట్స్‌తో పోలిస్తే ఐస్ క్రీమ్స్‌లో తక్కువ కొవ్వు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. ఐస్‌క్రీమ్‌లో 100 గ్రాములకు 5.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఫ్రోజెన్ డిజర్ట్‌లో మాత్రం 10.56 గ్రాముల కొవ్వు ఉంటుంది. భారత ఆహార చట్టాల ప్రకారం.. ఫ్రోజెన్ డిజర్ట్స్‌ను ఐస్ క్రీమ్స్‌గా అమ్మటం నిషేధం. అయినా, అనేక కంపెనీలు నిబంధనను ఉల్లంఘిస్తున్నాయి. మీరు కొనేటప్పుడే ఐస్ క్రీమ్ కొంటున్నారా? ఫ్రోజెన్ డిజర్ట్ కొంటున్నారా? అన్నది ప్యాక్‌పై జాగ్రత్తగా చదివి తీసుకోవటం చాలా ముఖ్యం.