గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే మంచిది.. ఖాళీ కడుపుతో తాగవచ్చా అంటే..

గ్రీన్ టీని చాలా మంది బరువు తగ్గటానికి తాగుతారు. కానీ ఏ సమయంలో తాగాలి? ఎలా తాగాలి? దాని లాభాలు ఏంటి అనే విషయం చాలా మందికి తెలీదు. అదేంటో మనం తెలుసుకుందాం.

GREEN TEA, HEALTH NEWS

ప్రతీకాత్మక చిత్రం 

గ్రీన్ టీని చాలా మంది బరువు తగ్గటానికి తాగుతారు. కానీ ఏ సమయంలో తాగాలి? ఎలా తాగాలి? దాని లాభాలు ఏంటి అనే విషయం చాలా మందికి తెలీదు. అదేంటో మనం తెలుసుకుందాం. ఆరోగ్యం, ఫిట్‌నెస్ రంగంలో గ్రీన్‌ టీ చాలా పాపులర్ అయింది. జిమ్‌కి వెళ్లే అవసరం లేకుండా దీన్ని తాగుతారు. వీటిలో ఖనిజ లవణాలు, విటమిన్లు, వాపు వ్యతిరేక లక్షణాలు, గుండె సంబంధిత రిస్కును తగ్గించే లక్షణాలు, కొన్ని రకాల క్యాన్సర్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇతర టీలో గ్రీన్‌ టీ ఆక్సిడేషన్ ప్రక్రియకు గురవదు. అందుకే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. సువాసన, హెర్బల్ రకాల గ్రీన్‌టీలతో పొలిస్తే ప్యూర్ గ్రీన్‌టీ ప్రాచీన కాలం నుంచి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

గ్రీన్‌ టీలొ ఉండే శక్తివంతమైన లక్షణాలు, చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైన్‌ను తగ్గిస్తాయి. అందులో ఉండే ఫ్లావనాయిడ్లు, పాలిఫినాల్స్ వంటి యాంటీ యాక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, జ్వరం నుండి దూరంగా ఉంచుతాయి. ఈ యాంటీ యాక్సిడెంట్లు మీ చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. దీనిలో ఉండే అధిక కెఫిన్ వల్ల కాలి కడుపుతో గ్రీన్‌ టీ తాగటం వల్ల కాలేయంపై హానికర ప్రభావం చూపిస్తుంది. అందువల్ల గ్రీన్‌ టీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల లోపు లేదా సాయంత్రం టైమ్‌లో తీసుకోవాలి. ఆహరానికి రెండు గంటల ముందు లేదా తిన్న తర్వాత తాగటం వలన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. అలాగే ఐరన్ కూడా లభిస్తుంది. మీరు రక్తహీనులు అయితే భోజనాల సమయంలో గ్రీన్‌ టీ తాగవద్దు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్