EYE STYE Remedies | కంటికురుపు ఎందుకు అవుతుంది.. ఇంట్లోనే సమస్యను తగ్గించుకొనే చిట్కాలివే..

కంటికురుపు అనేది మనం కామన్‌గా అవ్వడం చూస్తునే ఉంటాం. అసలు కంటికురుపు ఎందుకు వస్తుంది> అనే విషయం అందరికి తెలియదు. కంటికురుపు ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? ఎలా చికిత్స చేసుకోవాలి? తీసుకోవాలసిన జాగ్రత్తలు ఏంటి? అనేవి తెలుసుకుందాం.

EYE STYE

ప్రతీకాత్మక చిత్రం 

కంటికురుపు అనేది మనం కామన్‌గా అవ్వడం చూస్తునే ఉంటాం. అసలు కంటికురుపు ఎందుకు వస్తుంది? అనే విషయం అందరికి తెలియదు. కంటికురుపు ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? ఎలా చికిత్స చేసుకోవాలి? తీసుకోవాలసిన జాగ్రత్తలు ఏంటి? అనేవి తెలుసుకుందాం. కంటికురుపును ఇంగ్లిష్‌లో EYE STYE అని పిలుస్తారు. మాములుగా కనురెప్ప దగ్గర కొన్ని  గ్లాండ్స్  అనేవి ఉంటాయి. ఈ గ్లాండ్స్‌లో ఏవైనా ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు కంటికురుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికురుపు అనేది బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్, STAPHYLOCOCCUS అనే బాక్టీరియా నుండి వస్తుంది. మనం చేతులు శుభ్రంగా కడుక్కోకుండా తరచుగా కంటిని ముట్టుకుంటూ ఉంటాం. లేదా కంటిని నలుస్తూ ఉంటాం. అప్పుడు ఈ బ్యాక్టీరీయా అనేది మన కళ్లలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ గ్లాండ్స్ అనేవి కొన్ని ఆయిల్స్‌ని విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్లాండ్స్‌లో ఏదైనా బ్లాకేజ్ ఉన్న మనకు కంటికురుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కంటికురుపు ఎక్కువగా మస్కర, ఐ లైనర్,కాజల్ వంటి కంటికి సంబంధించిన వస్తువులు వేరే వాళ్లవి వాడినా లేదా డేట్ అయిపోయిన వాటిని ఉపయోగించినా కంటికురుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంటో అంటే కోవిడ్ సమయం నుండి మాస్క్ ఎక్కవగా వాడడం వల్ల కూడా కంటికురుపు ఎక్కువగా వస్తుందని అమెరికాలో వైద్యనిపుణులు తేల్చారు. మాస్క్ వల్ల ఎందుకు కంటికురుపులు వస్తున్నాయి? అంటే మాస్క్ పెట్టుకున్నప్పుడు మనం తీసుకునే శ్వాస తీసుకుంటూ, వదిలేస్తూ ఉంటాం. అలాగే తరచూ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన నోటిలోంచి, ముక్కులోంచి కొన్ని సూక్ష్మక్రిములు బయటకి వచ్చి కంటి లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్ అవుతుంటాయి. కాబట్టి మాస్క్ పెట్టుకోవడం వల్ల కూడా కంటికురుపు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణలు పేర్కొన్నారు.

కంటికురుపు లక్షణాలు:

ఈ కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారిలో చిన్న చిన్న కురుపులు ఉంటాయి. వాటిని కణితులు అంటాము. ఈ ఇన్‌ఫెక్షన్ రెప్ప దగ్గర కావచ్చు లేదా కింది రెప్ప దగ్గర కావచ్చు.  కొన్ని సందర్బాలలో ఇన్‌ఫెక్షన్ ఎక్కవై చీము కూడా వస్తూ ఉంటుంది. ఈ కంటికురుపుతో బాధపడేవారిలో కళ్లు ఎర్రబడిపోయి కళ్లలో నేడి నీరు రావడం, కంటిలో ఏదో ఉన్నట్లుగా అనిపించడం లాంటి లక్షణాలు చూస్తుంటాం.

కంటికురుపు చిక్సిత:

కంటికురుపు వారం లేదా పది రోజులు ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొద్దిగా రిలీఫ్ కావటానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

1. ఒక గుడ్డను తీసుకొని వేడినీళ్లలో ముంచి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ చోట పెట్టండి. ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టి ఉంచండి. ఆ తర్వాత తీసివేయాలి. ఇలా ప్రతి రోజు 4 -5 సార్లు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన కంటిలోని గ్లాండ్స్ ఎక్కడైతే బ్లాక్ అయి ఉంటాయో అవి కరిగిపోతాయి. దాని వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. 

2. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మీ వేళ్లతో కంటి రెప్పపై మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల కూడా రిలీఫ్ అనేది ఉంటుంది.

కంటికురుపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల మన శరీరం రీహైడ్రేడ్ అవుతుంటుంది. ఈ హైడ్రేషన్ ద్వారా కంటికురుపు తగ్గుతుంది. 

2. కంటికురుపు వచ్చిందని తరచుగా కళ్లను ముట్టుకోవాడం, కళ్లను నలవడం వంటివి చేయాకూడదు. 

3. ప్రతిరోజు 4-5 సార్లు కళ్లను మంచినీటితో శుభ్రం చేస్తూ ఉండాలి.

4. కంటికి  సంబంధించిన ఎలాంటి ఐటమ్స్ కంటికి ఆప్లై చేయాకూడదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్