బంగారం, వెండి కన్నా ఎంతో మేలు.. రాగి శక్తి సామర్థ్యాలు ఏంటంటే..

రాగికి ఉన్న శక్తి సామర్ధాలు చాలా మందికి తెలియవు. రాగి గురించి రహస్యాలు తేలిస్తే బంగారం జోలికి కూడా ఎవరు పోరు.

COPPER BENEFITES

ప్రతీకాత్మక చిత్రం

ప్రకృతిలో ప్రతి దానికి ఒక అర్ధం, పరమర్ధాలు ఉంటాయి. అందం, ఆనందం ఒక్కటే కాదు, ఆరోగ్యం, ఆయుర్దాయం కుడా ముఖ్యమే. ఆ దిశగా ప్రకృతిలో ఉన్న లోహలలో రాగికి ఉన్న శక్తి సామర్ధాలు చాలా మందికి తెలియవు. రాగి గురించి రహస్యాలు తేలిస్తే బంగారం జోలికి కూడా ఎవరు పోరు. సాధారణంగా అందరు బంగారం, వెండి, వజ్రలతో  తయారు చేసిన అభరణాలను ధరిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే రాగితో చేసిన అభరణాలను ధరిస్తారు. రాగి ఉంగరాలను ధరించే పద్ధతి పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. జ్యోతిష్య శాస్త్రంలో రాగితో చేసిన ఉంగరం ధరించడం శుభపరంగా పరిగణిస్తారు. రాగి ఉంగరం ధరించడం వల్ల ఆరోగ్యం సమస్యలు కుడా ఉండవు. రాగిని సూర్యుడు, అంగరకుడి లోహంగా పరిగణిస్తారు. రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

రాగి ఉంగరాలు, రాగి బ్రేస్‌లెట్ వంటివి ధరించే వారిలో  ముఖ్యంగా సూర్యకిరణాల వల్ల ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు పొట్ట సమస్యలు కుడా చాలా వరకు దూరం అవుతాయి. రాగి అభరణాలు ధరించడం వల్ల సూర్య, అంగరక దోషాలు తొలగిపోతాయి. ఉంగరపు వేలికి రాగితో చేసిన ఉంగరాన్ని ధరించడం వల్ల సూర్య దోషం తొలగిపోతుంది. రాగితో చేసిన అభరణాలను ధరించడం వల్ల శరీరంలోని రక్తం శుభ్రం అవుతుంది. రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. దీనిని ధరీంచడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని కుడా తాగటం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న రాగి పాత్రలు ఆనందం, శాంతిని కాపాడుతాయి. ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక దిశలో ఉంటే రాగి నాణేన్ని వేలాడదీస్తే వాస్తు దోశం తొలిగిపోతుందని వాస్తు పండితులు చెప్తుంటారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్