||ప్రతీకాత్మక చిత్రం|| నిద్రలో ఎటు వైపు పడుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం పడుకునే విధానాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. రోజంతా పనులు చేసి అలసిపోయి రాత్రుల్లో మనకు నచ్చిన విధంగా పడుకుంటూ ఉంటాం. కానీ, అలా పడుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ప్రతిరోజులో మూడవవంతు నిద్రకు కేటాయించుకోవాలి అంటే 24 గంటల్లో 8 గంటలైనా నిద్ర సమయాన్ని కేటాయించుకోవాలి. కొందరికి పగటి పూట నిద్ర వస్తుందంటే అలాంటి వాళ్లకు నిద్ర సరిపోవటం లేదని తెలుసుకోవాలి. నిద్ర సమయాన్ని కేటాయించుకోవాలి. అలా కేటాయించకాకపోతే.. బ్రెయిన్ దెబ్బ తినే అవకాశముంటుంది. మనకు నిద్ర సరిపోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మనం పడుకునే భంగిమను బట్టి మన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ప్రధానంగా మనం పడుకునే భంగిమలు నాలుగు రకాలుగా ఉంటాయి. కుడి వైపు తిరిగి, ఎడమ వైపు తిరిగి, పొట్టను పైవైపుగా ఉంచి, బోర్లా పడుకోవడం.
ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. తిన్న తిండి కూడా చక్కగా జీర్ణం అవుతుంది. ఈ పొజిషన్లో పడుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయి.
ఎవరైతే పొట్టను పై వైపుగా ఉంచి పడుకుంటారో.. వారికి ఎలాంటి వెన్నెముకలు నొప్పులు రాకుండా ఉంటుంది. ఈ విధంగా పడుకున్న వారికి ఆరోగ్యం కూడా చురుగ్గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇలా పడుకునే వాళ్ళు ఆరోగ్యవంతులని చెప్పవచ్చు. ఇలా పడుకోవడం వల్ల స్త్రీలకు కూడా లాభాలు ఉన్నాయి. చర్మం ఆరోగ్యంగా ముడతలు పడకుండా ఉంటుంది.
కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల చాలా అనర్ధాలు ఉన్నాయి. తిన్న తిండి జీర్ణం కాకపోగా జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
బోర్లా పడుకోవడం వల్ల అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఇలా బోర్లా పడుకుంటే వెన్నుపూస నుండి మెడ వరకు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని, ఒక పద్ధతి లేకుండా వెన్నుపూస ఉండడం వల్ల నిద్ర సరిగా పట్టదు. అలాగే గురక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ విధంగా పడుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.