కొత్తిమీర లాభాలు తెలుసా.. ఆ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

వందల రూపాయలు పెట్టి మాంసం తెచ్చుకుంటాం, చివర్లో కాసింత కొత్తిమీర వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. మాంసంలోనే కాదు ఏ కూరలో అయినా చివరలో కాస్త కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కి నోట్లో నీళ్లు ఊరుతాయి. అంత టేస్టు కొత్తిమీరది. కేవలం రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్య విషయంలోనూ కొత్తిమీర ముందే ఉంటుంది. మార్కెట్కు వెళ్లి కూరగాయలన్నీ కొన్నాక చివర్లో ఓ నాలుగు కొత్తిమీర కట్టలు కొనడం మర్చిపోరు. వంట రుచి పెంచడానికి అదొక ఆయుధం అయితే అనారోగ్య లక్షణాలను తరిమికొట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే లక్షణాలు కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. రుచిని పెంచుతూ ఆరోగ్యాన్ని కాపాడే కొత్తిమీర డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నట్లే. రోజువారి వంటకాలలో సువాసన కోసం కొత్తిమీరను వాడుతుంటాం దీని ద్వారా కోరలకు మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు కొత్తిమీరను కూరలా వండుకున్న లేదా పచ్చడి చేసుకున్న అద్భుతంగా ఉంటుంది. అయితే కొత్తిమీరను కొన్ని వేల సంవత్సరాల కిందటే వినియోగంలోకి తెచ్చారు. ఈ మొక్క మంచి వాసన ఇస్తుంది. కొత్తిమీరలో మన శరీరానికి పనికి వచ్చే ఎన్నో ప్రోటీన్లు విటమిన్లు లవణాలు లోహాలు ఉన్నాయి.

కొత్తిమీర త్రిదోషాలను హరిస్తుంది అంటారు.అంటే శరీరంలో వాతం పిత్తం కఫంలోని అసమానతలు తగ్గించడంలో కొత్తిమీర ముందుంటుందని ఆయుర్వేదం చెబుతుంది. నిత్యం వంటలలో కొత్తిమీర వాడడం కొత్తిమీర జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ సమస్యలు నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్ ను ఉదయాన్నే పరిగడుపున తాగితే జీర్ణ సమస్యలు అసిడిటీ మలబద్ధకం తగ్గుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజు తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి జ్వరం వచ్చినప్పుడు కొత్తిమీర జ్యూస్ తాగితే తొందరగా ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర లో ఉండే ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ మైక్రోవిల్ గుణాలు అన్ని జ్వరాలను తగ్గించడానికి పనిచేస్తాయి. కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యురినో బ్లాడర్ సమస్యలు కిడ్నీ దెబ్బతిన్నప్పుడు క్రియోటిన్ లెవెల్ పెరగడం కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నిటి నుండి ఉపశమనం పొందాలంటే కొత్తిమీర కషాయం తీసుకోవాలి.

కొత్తిమీరలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు పదార్థాలను సమన్వయ పరుస్తాయి ఆరోగ్యకరమైన కొవ్వులు పెంచి అనవసర కొవ్వులు కలిగిస్తుంది. కంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ముఖం మీద ఏర్పడే మొటిమలు నల్లమచ్చలను కొత్తిమీర ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకులను పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు తొలిగిపోతాయి. కొత్తిమీరలో యాసిన్షియల్ ఆయిల్ ఒత్తిడిని తలనొప్పిని తగ్గిస్తాయి. షుగర్ తో బాధపడే వారికి కొత్తిమీర మంచి ఔషధం. కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ లెవెల్ పెంచి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇందులోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. అమ్మవారు పోసినప్పుడు రోజుకో గ్లాసు చొప్పున కొత్తిమీర రసాన్ని వారం రోజుల పాటు పట్టిస్తే మచ్చలతో సహా తగ్గిపోతుంది. కొత్తిమీర రసాన్ని ఆల్మండ్ ఆయిల్ తో కలిపి దురద దద్దుర్ల మీద రాస్తే క్షణాలలో ఉపశమనం లభిస్తుంది.


కొత్తిమీరపై కొన్ని ఆసక్తికర విషయాలు

కొత్తిమీర శాస్త్రీయ నామం కొరియండ్రాం సాతివం దీన్నే చైనీస్ ఫ్యాన్సీ అని కూడా పిలుస్తారు

క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుండి కొత్తిమీరను ఆహార పదార్ధంగా వాడుతున్నారు అంతకుముందు పశువులకు మేతగా వేసేవారట.

కొత్తిమీర దాదాపు 20 అంగుళాల ఎత్తుకు పెరుగుతుంది.

కొత్తిమీర పూలు చాలా చిన్నగా ఉండి చాలా అందంగా ఉంటాయి పూలు తెలుపు లేదా ఊదా రంగులో పూస్తాయి కొన్ని ప్రాంతాలలో కొత్తిమీర పూలను సుగంధం కోసం వాడుతారు.

కొత్తిమీర లోని అన్ని విభాగాలను వాడుకోవచ్చు. కొత్తిమీర ఆకులు గింజలు కాడలు అన్నీ వంటలలో వాడుకోవచ్చు.

కొత్తిమీరను ఫ్రెష్ గా ఎండబెట్టి రుబ్బి పొడిగా కూడా వాడుతారు వేడి చేసినప్పుడు కొత్తిమీర సువాసన పోతుంది కనుక వంటలు వండాక కొత్తిమీర చల్లుతారు.

కొత్తిమీరలో ఉండే కొన్ని రకాల కెమికల్స్ వల్ల ఆహారం తొందరగా పాడవదు.

బెల్జియంలో కొన్ని రకాల బీర్లలో సువాసన కోసం కొత్తిమీర వాడతారు.

సూట్ సలాడ్ ఆమ్లెట్ రైస్ మాంసాలలో తప్పక కొత్తిమీర వాడతారు.


కొత్తిమీర కొన్ని చిట్కాలు

పెదవులు నల్లగా ఉన్నవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసాన్ని పెదవిల మీద రాస్తే నల్ల రంగు నుంచి మామూలు రంగుకు మారుతాయి. మార్కెట్లలో కొత్తిమీర కొనకుండా పూల కుండీలో కాసిన్ని ధనియాలు చల్లితే చాలు కొత్తిమీర మీ ఇంట్లోనే పండుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటే రెండు కొత్తిమీర ఆకులు నమిలితే చాలు.


వెబ్ స్టోరీస్