శరీర బరువును సులభంగా తగ్గించుకోవడానికి ఈ యోగాసనాలు వేస్తే తప్పకుండా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
కొంతమంది శరీర బరువు తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు, డైట్‌లు పాటిస్తారు. కానీ ఈ విషయంలో వారికి పెద్దగా ఫలితం కనిపించదు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ యోగా బరువు తగ్గడానికి సహాయపడదని చాలా మందికి తెలుసు. ఎందుకంటే యోగా కేలరీలను కూడా బర్న్ చేస్తుంది. కొన్ని యోగా భంగిమలు కొవ్వును కరిగించి..గుండె ఆరోగ్యంతోపాటు జీవక్రియను పెంచుతాయి.మీరు బరువు తగ్గడానికి యోగా సాధన చేయాలనుకుంటే, మీరు తప్పకుండా ఈ యోగా భంగిమలను వేయండి. అవేంటో చూద్దాం.
భుజంగాసనం:
ఈ ఆసనం పాము వలె ఉంటుంది. కాబట్టి దీన్ని భుజంగాసనం అంటారు. బోర్లాపడుకుని కాళ్లు చాచి నేలకు ఆనించాలి. కాలిమడమలను దగ్గరగా ఉంచి..కాళ్లను వెనక్కు స్ట్రెచ్ చేయాలి. చేతులను ఛాతీకి ఇరుపక్కలా ఉంచి శ్వాస తీసుకుంటూ తలనిపైకెత్తి, వీలైనంత వెనక్కు స్ట్రెచ్ చేయాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉంది..సాధారణ స్థితికి రావాలి. ఇలా కనీసం 10 సార్లైనా చేయాలి. ఈ ఆసనం పొట్ట దగ్గరున్న కొవ్వును సులభంగా కరిగిస్తుంది. పొత్తికడుపు దగ్గర కండరాలకు వ్యాయామం అందించి నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు రెడీటూఈట్ ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
మార్జాలాసనం:
ముందుగా వజ్రాసనంలో కూర్చుకొని ఈ ఆసనం చేయాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ మోకాళ్లూ, అరచేతులను నేలకు ఆనించాలి. అరచేతులు భుజాలకు, మోకాళ్లు తుంటికి సమాంతరంగా రానివ్వాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ నడుమును వీలైనంతగా పైకి లేపాలి. తలను కొద్దిగా కిందికి దించాలి. కాసేపు ఆలాగే ఉండి..ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నడుమును కిందికి దింపాలి. తలనిపైకి ఎత్తాలి. ఇలా 5 సార్లు చేయాలి. ఈ ఆసనాలతోపాటు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రాణాయామం చేస్తే ఉపయోగం ఉంటుంది. ఏకాగ్రతతోపాటు ఇమ్యూనిటి పెరుగుతుంది. ముద్రలు ప్రాణామాయాలు, ఆసనాలు వేటికవే ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా మనసు పెట్టి, సమయం కేటాయించి యోగాసాధనం చేయాలి.