బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ పళ్లు తింటే మంచి ఫలితం

అతి బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, జంక్‌ ఫుడ్‌ తినడం, వ్యాయామం లేకపోవడం, సమయ పాలన తిండితో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. అది కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల ఈ ఫలితాన్ని రాబట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

fruits

పండ్లు

అతి బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, జంక్‌ ఫుడ్‌ తినడం, వ్యాయామం లేకపోవడం, సమయ పాలన తిండితో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. చాలా మంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. అయితే, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. అది కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల ఈ ఫలితాన్ని రాబట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పండ్లలతో డ్రాగన్‌ ఫ్రూట్‌ ముందు వరుసలో ఉంటుంది. ధర అధికంగా ఉండే ఈ పండు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. పోషకాలతో కూడిన ఈ పండు తీసుకోవడం వల్ల నెల రోజుల్లో కొలస్ర్టాల్‌ కంట్రోల్‌లోకి వస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం కూడా సొంతమవుతుంది. ఇమ్యునిటీ పెరిగి, సీజనల్‌ వ్యాధులు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, జామకాయ తినడం వల్ల కూడా బరువు అదుపులోకి వస్తుంది. ఇందులో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. వీటి గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆమ్లాలు ఉంటాయి. పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం కఊడా పుష్కలంగా ఉంటుంది. జామకాయలను రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌ అవుతాయి. జీర్ణశక్తి మెరుగు చేయడంలో దోహదం చేస్తుంది. జామకాయ తింటే మలబద్ధకం దూరమవుతుంది. 

బీట్‌ రూట్‌ తింటే మెరుగైన ఫలితం ఉంటుంది. బీట్‌ రూట్‌ జ్యూస్‌, సలాడ్స్‌, కర్రీ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు అందుతాయి. ఇందులో ఉండే ఐరన్‌, ఫోలేట్‌, మాంగనీస్‌, పొటాషియం, విటమిన్‌ సి, ఫైబర్‌ వంటి పోషకాలు ఉంటాయి. రోజూ దీనిని తింటే స్టామినా పెరగడంతోపాటు శరీరంలోని మలినాలు బయటకు పంపించి డీటాక్స్‌ చేస్తుంది. రక్త హీనత తగ్గుతుంది. బీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లివర్‌ హెల్త్‌కి ఇది చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ద్రాక్ష పండు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిను, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచిది. బ్రెయిన్‌ హెల్త్‌కు మేలు చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు స్ర్టోక్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో, కేన్సర్‌ను ఎదుర్కోవడంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్‌ చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో విటమిన్‌ సి ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లను రెగ్యులర్‌గా తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయి, ఆవకాడో, పుచ్చకాయ వంటివి తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గించుకునే అవకాశం ఉంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్