ఎక్కువ కాలం జీవించాలనుకుంటే ముఖ్యంగా ఆహారం, జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతీకాత్మక చిత్రం
ఎక్కువ కాలం జీవించాలని ఎవరు కోరుకోరు? ఊరికే చెబితే అలా జరగదు కాబట్టి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం, జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ కాలం జీవించడానికి మరొక సులభమైన మార్గం ఉంది. ఈ విషయాన్ని సియోల్ యూనివర్సిటీ నిపుణులు తాజాగా తెలియజేశారు. ఇది కొన్నిసార్లు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వృద్ధులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వారి ఆయుర్దాయం కొంత వరకు పెరుగుతుందని గుర్తించారు. సుమారు 80 ఏళ్ల వృద్ధులను సదరు యూనివర్సిటీ నిపుణులు సర్వేలో చేర్చారు. వారు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వారి శరీరాలపై ఎలాంటి సానుకూల ప్రభావాలను చూపుతుందో పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, వారిలో దాదాపు 30 శాతం మంది ఎక్కువ కాలం జీవిస్తున్నారని వారు కనుగొన్నారు. వయోజనుడు తన సామర్థ్యాన్ని బట్టి మాత్రమే వ్యాయామం చేయాలి.