నడకే వెన్ను నొప్పికి పరిష్కారం.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం

వెన్ను నొప్పితో బాదపడుతున్నారా.. హాస్పిటళ్ల చుట్టూ తిరిగి పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారా.. అయితే, ఈ సమస్యలన్నింటికీ వాకింగ్‌తో చెక్ పెట్టవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు.

WALKING

ప్రతీకాత్మక చిత్రం

హెల్త్ న్యూస్, ఈవార్తలు : వెన్ను నొప్పితో బాదపడుతున్నారా.. హాస్పిటళ్ల చుట్టూ తిరిగి పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారా.. అయితే, ఈ సమస్యలన్నింటికీ వాకింగ్‌తో చెక్ పెట్టవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. వారానికి కనీసం మూడు సార్లు ఎక్కువ సేపు నడిస్తే సగానికి సగం వెన్ను నొప్పి తగ్గిపోతుందని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, ఒక వేళ చికిత్స చేసుకున్నా ప్రతి 10 మందిలో ఏడుగురిలో వెన్ను నొప్పి మళ్లీ తిరగబెడుతున్నది. ఇలాంటి సమస్యలకు నడకే మంచి పరిష్కారం అని యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు. ప్రతి రోజు 5-10 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదని, చిన్నగా నడక ప్రారంభించి.. మెల్లిమెల్లిగా ఎక్కువ సేపు నడుస్తూ ఉండాలని సూచిస్తున్నారు. వారానికి ఐదు సార్లు.. సగటున 130 నిమిషాల పాటు నడిస్తే వెన్ను నొప్పి నుంచి భారీ ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్