Vitamin E | ఆరోగ్యానికి విటమిన్-ఈ.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రయోజనాలు ఇవే..

సాధారణంగా మన శరీరానికి చాలా అవసరమైన మైక్రో న్యూట్రియన్స్ అయిన విటమిన్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందులో విటమిన్-ఈ పాత్ర కూడా కీలకం. మన శరీరంలో విటమిన్-ఈ అనేది ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

VITAMIN-E BENEFITS

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా మన శరీరానికి చాలా అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అయిన విటమిన్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందులో విటమిన్-ఈ పాత్ర కూడా కీలకం.  మన శరీరంలో విటమిన్-ఈ  అనేది ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్-ఈ చర్మం, గుండె, ఎముకలు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడుతుంది. అందుకే చాలామంది అమ్యాయిలు విటమిన్-ఈ క్యాప్సిల్స్‌ని ముఖానికి ఆప్లై చేస్తుంటారు. దీనివల్ల స్కీన్‌లో కొల్లజెన్ ఉత్పత్తి పెరిడి ముఖంపై ఉండే  చర్మం బిగుతువుగా మారి ముడతలు లేకుండా అవుతుంది. అంతేకాకుండా మచ్చలు, స్కార్ట్స్‌ను తగ్గించడంలో కుడా సహయపడుతుంది. విటమిన్-ఈ క్యాప్సుల్స్‌ని మింగడం వల్ల ఎక్సిమా వంటి భయంకరమైన చర్మ సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఇక, ఈ రోజుల్లో హర్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కుడా హర్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఈ అనేది మన రక్తనాళల్లో రక్తం గడ్డకట్టకుండా చేసి హర్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. మరోవైపు.. కాలేయం మన శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంటుంది. తరచు బయట ఫుడ్ తినటం వల్ల చాలామందిలో నాన్ ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు ప్రతిరోజు విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు. 

ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వాటిని దెబ్బతీస్తుంటుంది. దీనివల్ల తొందరగా ముసలివాళ్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బలమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన విటమిన్-ఈని తీసుకోవడం వల్ల చర్యం, లివర్, గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ శరీరంలో విటమిన్-ఈ లోపిస్తే నరాల వ్యవస్థ బలహీనమవుతుంది. కండరాలు క్షీణించి దృష్టి మందగిస్తుంది. రక్త కణాలు తొందరగా నశించి రక్తహీనత వస్తుంది. చర్యం పొడిబారి ముడుతలు పడుతాయి. రోగనిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి బాదం, పల్లీలు, సన్ ఫ్లవర్ నూనె, ఆకుకూరలు వంటి విటమిన్-ఈ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.

విటమిన్-ఈ ఆహార పదార్థాలు:

1. ఆలివ్స్

2. బాదాం

3. పొప్పడి పండు

4. సేసమే సీడ్స్

5. అవకాడో

6. మామిడి పండ్లు

7. కివి ఫ్రూట్

8. రెడ్ క్యాప్సికమ్

9. ఆకుకూరలు

10. చేపలు

11. ఓట్స్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్