పిల్లల వ్యాక్సిన్ షెడ్యూల్: తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు

పిల్లలకు ఏ వయసులో ఏ వ్యాక్సిన్ వేయించాలి? అసలు పిల్లలకు ఇన్ని వ్యాక్సిన్లు ఎందుకు? అవసరమా? పిల్లలకు వేయించాల్సిన వ్యాక్సిన్లు ఏ కారణంతో అయినా వేయించలేకపోతే ఏం చేయాలి? వ్యాక్సిన్లు పై పూర్తీ అవగాహన తెలుసుకుందాం.

guiding schedule of vaccination for kids

ప్రతీకాత్మక చిత్రం

అసలు వ్యాక్సిన్ అంటే ఏమిటి? సాధారణంగా మనకు ఏదైనా ఇన్ఫెక్షన్లను (వైరస్ లేదా బ్యాక్టీరియా) అడ్డుకోవడం కోసం తయారు చేసిన మందు. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్ ప్రభావితం చేసే వైరస్ లేదా బ్యాక్టీరియాలను ఇనాక్టివ్ చేసి వ్యాక్సిన్ రూపంలో అందిస్తారు. వ్యాక్సిన్లు పిల్లలను ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధుల నుండి రక్షిస్తాయి. ప్రతి వ్యాక్సిన్ పిల్లలను కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల నుండి రక్షించడానికి తయారు చేస్తారు.

పుట్టిన 24 గంటలలోపు వేయించాల్సిన వ్యాక్సిన్లు:

బి.సి.జి, ఒపి.వి, హెపటైటిస్-బి వేయించాలి.

బి.సి.జి: టిబి నివారణ, ఒపి.వి: పోలియో, హెపటైటిస్-బి: కామెర్ల వ్యాధి నివారణ.

ఒకవేళ ఏ కారణం చేత గానీ వేయించలేకపోతే కనీసం వారంలో వేయించాలి.

6 వారాల్లో  వేయించాల్సిన వ్యాక్సిన్లు:

ఓ.పి.వి -1, పెంటావాలెంట్-1, ఆర్.వి.వి, ఎఫ్.ఐ.పి.వి-1, పి.సి.వి-1 వ్యాక్సిన్లు వేయించాలి.

పెంటావాలెంట్ -1 : కంఠసర్పి, 2. కోరింత దగ్గు 3. ధనుర్వతము 4.కామెర్లు 5. మెదడు వాపు న్యుమోనియా ఐదు వ్యాధుల నివారణకు వాడుతారు.

ఆర్.వి.వి -తీవ్ర నీళ్ళ విరేచనాలు, వాంతులు, జ్వరము కడుపునొప్పి మూత్ర విసర్జన  తగ్గడం, బరువు తగ్గడం,

పి.సి.వి -నిరంతర దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవాడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవాడం వ్యాదుల నివారణకు ఉపమోగిస్తారు.

10 వారాల్లొ వేయించాల్సిన వ్యాక్సిన్లు:

ఓ.పి.వి -2,  పెంటావాలెంట్-2,ఆర్.వి.వి-2,  వ్యాక్సిన్స్ వేస్తారు.

14 వారాల్లొ వేయించాల్సిన వ్యాక్సిన్లు:

ఓ.పి.వి-3, ఆర్.వి.వి -3,  ఎఫ్.ఐ.పి.వి -3, పెంటావాలెంట్ -3, పి.సి.వి-2 వ్యాక్సిన్స్ వేయించాలి 

9 -12 నెలల్లో వేయించాల్సిన వ్యాక్సిన్లు:

యం.ఆర్ -1, జె.ఇ -1,ఎఫ్.ఐ.పి.వి -4, పి.సి.వి-బి వ్యాక్సిన్స్ వేయించుకొవాలి.

16 -24 నెలల్లో వేయించాల్సిన వ్యాక్సిన్లు:

యం.ఆర్-2, జె.ఇ -2,ఒ.పి.వి.బూస్టర్, డి.పి.టి-1వ్యాక్సిన్స్ వేయించుకొవాలి.

డి. పి.టి-మూడు వ్యాధుల  నిరాణకు కంఠ సరిపి, కోరింత దగ్గు, ధనుర్వాతము.

5 -6 సంవత్సరాల వయసులో వేయించాల్సిన వ్యాక్సిన్లు: డి.పి.టి -2

10 సంవత్సరాల పిల్లలకు వేయించాల్సిన వ్యాక్సిన్లు: టి.డి-1 బూస్టర్

16 సంవత్సరాల పిల్లలకు వేయించాల్సిన వ్యాక్సిన్లు: టి.డి-2 బూస్టర్ వేయించాలి.

9–14 సంవత్సరాల ఆడపిల్లలకు:

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 6 నెలల గ్యాప్‌లో రెండు డోసులు వేయాలి. ఒకవేళ 14 సంవత్సరాలు దాటినా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ని క్యాచ్-అప్ వ్యాక్సిన్ అంటారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా టైమ్‌కు వ్యాక్సిన్ వేయించలేకపోయినప్పటికీ, వారంలో వేయించితే మంచిది. లేకపోతే, కొన్ని నెలల తర్వాత కూడా అవసరమైన డోసుల్ని సర్దుబాటు చేసి క్యాచ్-అప్ వ్యాక్సిన్ వేయించవచ్చు.

జాగ్రత్తలు:

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తేలికపాటి జ్వరం, దద్దుర్లు, గడ్డకట్టడం వంటి ఇబ్బందులు రావచ్చు.అలా అని జ్వరం రానంత మాత్రానా వ్యాక్సిన్ పని చేయదు అనేది అపోహ మాత్రమే. వ్యాక్సిన్ వేసిన తర్వాత కచ్చితంగా మన శరీరంలో యాంటీబాడీస్ తయారు అవుతాయి. జ్వరం వచ్చినపుడు 1–2 రోజులు ప్యారాసిటమాల్ వాడవచ్చు. దద్దుర్లు, గడ్డకట్టడం ఉన్నప్పుడు ఐస్ క్యూబ్‌ని కాటన్ గుడ్డలో పెట్టి కాపాలి. టీకా తీసుకున్న ప్రదేశంలో 3–4 నిమిషాల ఒత్తిడి పెంచాలి. నలపకూడదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 15 నిమిషాలు ఆసుపత్రిలో ఉండాలి. పిల్లలు ఎక్కువగా ఏడ్చినా, 102–103 డిగ్రీల జ్వరం ఉంటే, లేదా దద్దుర్లు ఎక్కువగా అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్