బంగాళదుంపలతో చేసే బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వాటిని కొన్ని టిప్స్ తో చేస్తే నూనె అస్సలు పీచ్చుకోవు. ఎలా తయారు చేయాలో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
వానాకాలం సాయంత్రం పూట వేడి వేడి ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది. అయితే ఒకసారి ఆలూ బజ్జీలు ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసే రెసిపి ఇది. కొన్ని చిట్కాలు పాటించి చేస్తే బజ్జీలకు నూనె పట్టుకోదు. కాస్త చట్ పటా ఫ్లేవర్ రావాలంటే చాల్ వలే చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
2 బంగాళదుంపలు
కప్పున్నర శనగపిండి
-2 చెంచాల బియ్యంపిండి
-1 చెంచా కారం
-1 చెంచా ఉప్పు
-పావు టీస్పూన్ పసుపు
-1 టీస్పూన్ జీలకర్ర
-డీప్ ఫ్రై కి సరిపడా నూనె
-2 చెంచాల వేడి నూనె
స్టఫ్ఫింగ్ కోసం:
-2 చెంచాలు నూనెలో వేయించిన పల్లీలు
-1 ఉల్లిపాయ సన్నం ముక్కలు
-సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు
ఆలు బజ్జీ తయారీ విధానం:
ముందుగా బంగాళదుంపలను కడిగేసుకుని పైనున్న చెక్కును తీసేయాలి.ఇప్పుడు వాటిని అడ్డంగా సన్నం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఒక బౌల్ లో శనగపిండి, బియ్యంపిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకోవాలి. అన్నీ వేసి కలిపిన తర్వాత అందులో రెండు చెంచా వేడి చేసిన నూనె పోసుకుని మరోసారి కలపాలి.ఇప్పుడు కొద్దకొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి జారుడుగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే తరిగిపెట్టుకున్న ఆలు ముక్కలు వేసేయాలి.స్టవ్ పెట్టుకుని కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక్కో ఆలు ముక్కకు పిండి అంటుకునే లాగా చూసి నూనెలో వేసుకోవాలి. స్టౌ మీడియం మంట పెట్టి వాటిని వేయించుకుని రంగు మారగానే బయటకు తీసుకోవాలి. పెద్ద మంట మీద చేస్తే లోపల ఆలు వేగదు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
శనగపిండితో బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీ కరకరలాడుతుంది. అలాగే పిండి కలిపేటప్పుడు వేడి నూనె వేయడం వేస్తే బజ్జీలు నూనె ఎక్కువగా పీల్చుకోవు. అలాగే ఆలు ముక్కల్ని మరీ మందంగా కట్ చేసుకోవద్దు. సన్నగా ఉంటే తొందరగా ఉడికుతాయి. బజ్జీ తింటున్నప్పుడు పచ్చిదనం రుచి తెలీదు.