దేశవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ, ఈవార్తలు : దేశవ్యాప్తంగా చైనా కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే నాలుగు కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో రెండు కేసులు నమోదు కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక కేసు, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక కేసు నమోదైంది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు పాజిటివ్‌గా నిర్ధారణ కావటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటు.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు జాగ్రత్తలు తెలియజేసింది. జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ పెట్టుకోవాలని సూచించింది.
జలుబు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
- నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి
- చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు