ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉంటూ ఎంతోమంది ఒత్తిడికి గురవుతుంటారు. ప్రస్తుతం ఒత్తిడి లేని వ్యక్తి ఎవరు లేరంటే అతిశయోక్తి కాదేమో. పాఠశాలకు వెళుతున్న వెళ్లాలి నుంచి.. వృద్ధుల వరకు అందరూ తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరమైన సమస్యలు, ఇతర కారణాలతో ఒత్తిడి అన్నది ప్రతి ఒక్కరికి పరిపాటిగా మారింది. అయితే ఒత్తిడి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే మార్గాలను అనుసరించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉంటూ ఎంతోమంది ఒత్తిడికి గురవుతుంటారు. ప్రస్తుతం ఒత్తిడి లేని వ్యక్తి ఎవరు లేరంటే అతిశయోక్తి కాదేమో. పాఠశాలకు వెళుతున్న వెళ్లాలి నుంచి.. వృద్ధుల వరకు అందరూ తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరమైన సమస్యలు, ఇతర కారణాలతో ఒత్తిడి అన్నది ప్రతి ఒక్కరికి పరిపాటిగా మారింది. అయితే ఒత్తిడి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే మార్గాలను అనుసరించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెదడును రిలాక్స్ చేసే కొన్ని టెక్నిక్స్ పాటిస్తే ప్రశాంతంగా ఉండడంతోపాటు ఒత్తిడి తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒత్తిడి పెరగడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒత్తిడిని తగ్గించుకొని మెదడును రిలాక్స్ గా ఉంచే టెక్నిక్స్ పాటించడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది. ఇందులో డీప్ ప్రీత్ చాలా ఉపయోగకరమైంది. డీప్ బ్రీత్ వ్యాయామం చేయడం వల్ల నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఆందోళన దరి చేరదు. స్ట్రచ్చింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు ఆరోగ్యంగా మారతాయి.
కండరాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల మైండ్ ఫ్రీ అవుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రోజువారి నడక వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా క్రమం తప్పకుండా చేసే ధ్యానం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. మెదడు కూడా రిలాక్స్ అవుతుంది. మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే పాటలు వినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి పొందుతుంది. యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా చేస్తే ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. మెదడు కూడా రిలాక్స్ అవుతుంది. వేడినీటితో స్నానం చేయడం వల్ల కూడా బ్రెయిన్ రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో లావెండర్ ఆయిల్ కలిపి స్నానం చేస్తే ఒత్తిడి మాయం అవుతుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం కూడా ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం వారం నుంచి పది రోజులు పాటు చేయడం ద్వారా కలిగే లాభాలను స్వయంగా పరిశీలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.