వేసవి రాకతో ఎండ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతోంది. సాధారణంగా ఎక్కువమంది డీహైడ్రేట్ సమస్యతో బాధ పడుతుంటారు. ఈ కాలంలో చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కళ్ల సమస్యలు కుడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
వేసవి రాకతో ఎండ ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతోంది. సాధారణంగా ఎక్కువమంది డీహైడ్రేట్ సమస్యతో బాధ పడుతుంటారు. ఈ కాలంలో చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కళ్ల సమస్యలు కుడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో వచ్చే సమస్యలను అధిగమించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కాలంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది? అనే విషయాల గురించి చూద్దాం.
ఎండ ప్రభావంతో శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకి రావడం వల్ల నీరసం వచ్చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్నపిల్లలు, వృద్దులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయట వాతావరణం వేడిగా ఉంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పిల్లలో చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల వడదెబ్బ తాకే అవకాశం వారిలో ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు, ఇతర పానీయలు తాగని కొందరు పిల్లలు ఎండలో తొందరగా నీరసించి పోతారు. ఎండలో ఎక్కువగా ఆడినా, తిరిగినా చెమట రూపంలో శరీరంలోని నీరు శాతం బయటకి వెళ్లి శరీరం నీరసిస్తుంది. ముఖ్యంగా 6 సంవత్సరంలోపు పిల్లలను వేసవిలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని వైద్యనిపుణులు వెల్లడించారు. పిల్లలు వేసవిలో ఉపశమనం పొందాలంటే తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.
- ఎండలోకి తప్పనిసరిగా వెళ్లక తప్పదు అనేవారు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా వాడాలి.
- పండ్ల రసాలు, కొబ్బరి నీరు తాగడం అలవాటు చేయాలి.
- రోజుకు కనీసం 4 నుండి 5 లీటర్ల మంచి నీళ్లు తప్పక తాగేలా చూడాలి.
- కాటన్ దస్తువులు ధరించాలి.
- పిల్లలకు పెట్టే ఆహారంలో తగినంత ఉప్పు, నీటి శాతం ఉండేలా చూసేకోవాలి.
- ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం మంచిది.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
- వేసవిలో మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.
- పాలు, పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాలు వంటివి తీసుకోవాలి.
- తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి.
- విలువైన పోషకాలు ఉండే పుచ్చకాయ, ద్రాక్ష, మస్క్ మిలోన్ పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
- మధ్య మధ్య మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో నీరసం తగ్గుతుంది.
- కీరదోస, క్యారెట్, బీట్‌రూట్ వంటి పచ్చి కూరగాయలను తినడం మంచిది.
- నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో నీటి పరిమాణం స్థిరంగా ఉండి ఎండ దెబ్బకు గురికాకుండా ఉంటారు.