Health Tips: వర్షాకాలంలో ఈ కూరగాయ తప్పక తినాల్సిందే

కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో టిండా ఒక కూరగాయ. దీన్ని దిల్ పసంద్, ఇండియన్ బేబీ పంప్కిన్, యాపిల్ గార్డ్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.

Apple Guard

ప్రతీకాత్మక చిత్రం 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అన్ని  రకాల కూరగాయలు, ఆకుకూరలు మన డైట్లో చేర్చుకోవాలి. అయితే ఎన్నో రకాల పోషకాలు ఉన్న కొన్ని కూరగాయల గురించి చాలా మందికి అంతగా తెలియకపోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి టిండా. దీన్ని దిల్ పసంద్, ఇండియన్ బేబీ పంప్కిన్, యాపిల్ గార్డ్ అనికూడా పిలుస్తుంటారు. వర్షాకాలంలో ఈ బేబీ గుమ్మడికాయలను డైట్లో చేర్చుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

టిండా వెజిటేబుల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రస్తతం వర్షాకాలంలో టిండాను మీ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. 

టిండాలో కేలరీలు చాలా తక్కువగా ఉండటంతోపాటు బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ప్రొటీన్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, భాస్వరం, ఐరన్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. టిండాను కూర వండుకోవచ్చు లేదంటే పప్పులో వేసుకోవచ్చు. అలర్జీలు, శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళానాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ కూరగాయలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉంటే త్వరగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్