Ranapala Leaf Uses | ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధానంగా మారింది. అందుకే ప్రకృతి సంపద విశిష్టతను వివరించి ఆరోగ్య రక్షణకు ఈ సృష్టి సంపదను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
Ranapala Leaf Uses | ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధానంగా మారింది. అందుకే ప్రకృతి సంపద విశిష్టతను వివరించి ఆరోగ్య రక్షణకు ఈ సృష్టి సంపదను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయుర్వేదం కూడా ఒకటి. ప్రకృతి మనకు ఇచ్చిన అనేక ఔషధాలలో మరో దివ్యఔషధం రణపాల (Ranapala Leaf). రణపాల మొక్కలో ఉన్న గొప్పతనం ఏంటంటే..ఇది శరీరంలో వచ్చే అన్ని రోగాలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. రణం అంటే శోధన, పాల అంటే శాసించేది అని అర్థం. దీని శాస్త్రీయనామం బ్రయోఫిల్లం. బ్రయోఫిల్లం అంటే స్వయంగా మొలకెత్తే ఆకు అని అర్థం. ఈ ఆకును మట్టిలో వేసినా ఆకు అంచుల నుంచి కొత్త మొక్కలు వస్తాయి. ఈ రణపాల ఆకుకి పది నుంచి పదిహేను రోజుల పాటు నీళ్ళు పోయకున్నా వాడిపోకుండా ఉంటాయి. వీటిలో కొంత నీరు ఎప్పుడు ఉంటుంది కాబట్టి వీటిని సక్కంబలెంట్ ఆకులు అని కూడా అంటుంటారు. కేథడ్రాల్ బెల్స్, కలాంచోయే పిన్నాటా, పత్తరం చట్టా అని ఈ రణపాల ఆకుని ఒక్కో భాషలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు.
రణపాల ఆకు ముఖ్య ప్రాధాన్యం ఏంటంటే.. ఇది కిడ్నీరాళ్లకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. ఈ ఆకుని కాషాయంగా చేసుకొని తాగితే కిడ్నీలో రాళ్లతో పాటు మూత్రాశయంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
రణపాల ఆకును మెత్తగా నూరి గాయాలపై, వేడి పొక్కులపై పూతలా రాసుకుంటే గాయాలు రెండు రోజుల్లో మాటుమాయం అవుతాయి.
రణపాల ఆకుపై ఉప్పు రాసి నమిలినా చాలు.. రక్తం శుధ్దిచేయడానికి ఉపయోగపడుతుంది.
తల నొప్పి, ఒళ్లునొప్పులు, రక్తపోటు, డయాబెటిస్, పుండ్లు, చర్మవ్యాధులు, వేడిపొక్కులు, గుండె వ్యాధులు, మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలు, రక్త శుద్ధి, జుట్టు పటుత్వం, గ్యాస్ట్రిక్ అల్సర్లు, మోకాళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి పెంపొందించటానికి ఇలా ఒక్కటి కాదు ఈ రణపాల అనేక రోగాలకు ఏకైక పరిష్కారంగా చెప్పవచ్చు.