హెపటైటిస్, పచ్చకామెర్లు రెండు భిన్నమైన అనారోగ్య సమస్యలు. అయితే ఈ సమస్యలతో బాధపడే వారిలో మాత్రం ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే హెపటైటిస్ తో బాధపడే వారు తాము పచ్చకామెర్ల సమస్యతో బాధపడుతున్నాము అని భావించి వైద్యం పొందుతుంటారు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెపటైటిస్, పచ్చకామెర్లు అనేవి పూర్తిగా భిన్నమైనవి.
ప్రతీకాత్మక చిత్రం
హెపటైటిస్, పచ్చకామెర్లు రెండు భిన్నమైన అనారోగ్య సమస్యలు. అయితే ఈ సమస్యలతో బాధపడే వారిలో మాత్రం ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే హెపటైటిస్ తో బాధపడే వారు తాము పచ్చకామెర్ల సమస్యతో బాధపడుతున్నాము అని భావించి వైద్యం పొందుతుంటారు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెపటైటిస్, పచ్చకామెర్లు అనేవి పూర్తిగా భిన్నమైనవి. హెపటైటిస్ ప్రమాదకరమైనది. ఇది కాలేయ వాపునకు దారితీసి ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. కాబట్టి హెపటైటిస్ గురించి తెలుసుకోవడంతోపాటు కామెర్లు, హెపటైటిస్ మధ్య ఉన్న వ్యత్యాసాలపై అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు భిన్నమైన ఆరోగ్య సమస్యలు. వీటి లక్షణాలు వల్ల రెండు ఒకటే అని చాలామంది భావిస్తుంటారు. రెండింటి మధ్య తేడాలను గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
హెపటైటిస్ లో ఉండే లక్షణాలు ఇవి..
హెపటైటిస్ వైరస్ లు హెపటైటిస్ వ్యాధికి ప్రధాన కారణంగా ఉంటాయి. కానీ ఆ వైరస్ తో పాటు పలు రకాల ఇన్ఫెక్షన్లు, ఇమ్యునో వ్యాధులు, ఆల్కహాల్, డ్రగ్స్ వంటివి పరిస్థితిని విషమం చేస్తాయి. సకాలంలో చికిత్స అందించకపోతే క్యాన్సర్ తో పాటు కాలేయ సమస్యలను పెంచి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్ కాలేయ వాపునకు దారితీస్తుంది. ఇది వివిధ కారణాలవల్ల వస్తుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ వైరస్ లు దీనిలో ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని అటాక్ చేసి లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని రకాల కెమికల్స్, మెడికేషన్స్ పరిస్థితిని కేవలం చేస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారిలో కూడా హెపటైటి సమస్యలు అధికంగా ఉంటాయి. హెపటైటిస్ తో బాధపడే వారిలో ఫటిగో, వాంతులు, కడుపునొప్పి, పొత్తికడుపు వాపు, యూరిన్ డార్క్ గా రావడం, మూత్ర విసర్జనలో మార్పులు హెపటైటిస్ లక్షణాలుగా ఉంటాయి.
కామెర్లు లక్షణాలు ఇవే
హెపటైటిస్, లివర్ క్యాన్సర్ వంటివి లివర్ సమస్యలు కామెర్ల బారినపడేలా చేస్తాయి. హీమో లిటిక్ అనీమియా, మూత్ర విసర్జన జరగకుండా నిరోధించడం, కొన్ని అంటూ వ్యాధులు, మందులు, జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు కామెర్లకు దారితీస్తాయి. కామెర్ల బారిన పడిన వారిలో శరీరం, కళ్ళు పసుపు రంగులోకి మారుతుంది. యూరిన్ డార్క్ గా వస్తుంది. మూత్ర విసర్జనలో మార్పులు, ఫటీగో వంటి లక్షణాలు ఉంటాయి.
రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే..
కామెర్లు, హెపటైటిస్ మధ్య వ్యత్యాసాలను గుర్తించడం చాలా కీలకం. కాలేయ వాపు వల్ల హెపటైటిస్ వస్తుంది. రక్తంలో బిల్ రూబిన్ చేరడం వల్ల కామెర్లు వస్తాయి. రెండు సమస్యల్లో లక్షణాలు దగ్గరగా ఉన్నప్పటికీ హెపటైటిస్ కడుపునొప్పి, వాంతులు వంటి తీవ్రమైన లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి గుర్తించినప్పుడు కచ్చితంగా వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది.