Copper Water Bottles : ఈ మధ్యకాలంలో కాపర్ వాటర్ బాటిల్స్, కాపర్ గ్లాస్‌లో వాటర్ తాగటం ఎక్కువ అయిపోయింది. అయితే వాటిని వాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
ఈ మధ్యకాలంలో కాపర్ వాటర్ బాటిల్స్, కాపర్ గ్లాస్‌లో వాటర్ తాగటం ఎక్కువ అయిపోయింది. అయితే వాటిని వాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట తెలసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు వాడుతున్న కాపర్ బాటిల్ లేదా కాపర్ గ్లాస్ అనేవి ప్యూర్ కాపరా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్‌లో కాపర్ బాటిళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల కాపర్‌తో కోటింగ్ చేసిన ప్రొడక్ట్స్ చాలా దొరుకుతున్నాయి. అందుకని మీరు ప్రోడక్ట్ కొనే ముందు వాటి మీద ఉన్న వివరాలు చదివి తీసుకోవాలి.
అలాగే మనం వాటర్ బాటిల్స్‌ని అప్పటికప్పుడు ఫిల్ చేసుకొని తాగుతూంటాం. ఈ కాపర్ బాటిల్స్‌ని కుడా అలాగే వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే కాపర్ బాటిల్స్‌లో నీళ్లు ముందురోజు రాత్రి నింపుకొని ఆ తర్వాతి రోజు తాగాలి. కాపర్ బాటిల్స్ లోని వాటర్‌ని మనం లిమిట్‌కి మించి తాగరాదు. ఇలా తాగటం వల్ల ఎసిడిటి, బ్లోటింగ్, వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాపర్ వాటర్ బాటిల్స్, కాపర్ గ్లాస్ కేవలం మనం తాగునీటికి మాత్రమే వాడుకోవాలి. కూల్‌డ్రింగ్స్‌కి గానీ, ఫ్రూట్ జ్యూస్‌లకు గానీ, పాల పదార్థాలకు కానీ వాడకుడదు.