Health Care: ఈ గింజలు గుప్పెడు తింటే చాలు కేజీ మటన్, చికెన్ కన్నా ఎక్కువ ప్రోటీన్లు లభించడం ఖాయం

సాధారణంగా శాకాహారులకు ప్రోటీన్ ల కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే శాకాహారంలో ఉండే ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువగా లభించదు. శాఖాహారులు సాధారణంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంటాయి. ముఖ్యంగా చికెన్, మటన్, కోడిగుడ్లు అలాగే పాలలో ప్రోటీన్లు అధికంగా లభిస్తూ ఉంటాయి.

health care

ప్రతీకాత్మక చిత్రం 

సాధారణంగా శాకాహారులకు ప్రోటీన్ ల కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఎందుకంటే శాకాహారంలో ఉండే ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువగా లభించదు. శాఖాహారులు సాధారణంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రోటీన్లు మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంటాయి. ముఖ్యంగా చికెన్, మటన్, కోడిగుడ్లు అలాగే పాలలో ప్రోటీన్లు అధికంగా లభిస్తూ ఉంటాయి. అయితే మన శరీర నిర్మాణానికి కండరాల పటిష్టతకు అత్యంత అవసరమైనవని ప్రోటీన్లు అని నిపుణులు చెబుతున్నారు. మరి శాఖాహారులకు ప్రోటీన్లు ఎలా లభిస్తాయనే సందేహం మీకు కలగవచ్చు. శాకాహారులకు ప్రోటీన్లు కావాలంటే మాత్రం తప్పనిసరిగా కొన్ని రకాల గింజలను ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి గింజల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 

శనగలు:

నానబెట్టిన శనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు ఇందులో ఫైబర్, విటమిన్ బి, సెలీనియం, అమినో యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల శనగల్లో సుమారు 20 గ్రాముల వరకు ప్రోటీన్లు లభిస్తాయి. ఇది మీ శరీరంలో కండరాల నిర్మాణానికి ఎంతో ఉపయోగపడతాయి. శనగలను నానబెట్టి ఉడకబెట్టుకొని ఆ తర్వాత అందులో కాస్త తాళింపు వేసుకొని తిన్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది.

రాజ్మా గింజలు:

రాజ్మా గింజల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. రాజ్మా గింజలను నానబెట్టి వీటితో కూర చేసుకోవచ్చు లేదా ఉడకబెట్టుకొని తినవచ్చు. రాజ్మా గింజల్లో ప్రోటీన్లు అత్యధికంగా లభిస్తాయి. 100 గ్రాముల రాజ్మా గింజల్లో సుమారు 20 గ్రాముల పైగా ప్రోటీన్ లభిస్తుంది. వీటిలో ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు రాజ్మా గింజల్లో చాలా వరకు ఐరన్ అదేవిధంగా ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా లభిస్తుంది. మధుమేహ రోగులకు రాజ్మా గింజలు చక్కటి ఆహారం అని చెప్పవచ్చు. 

చిక్కుడు గింజలు:

గోరుచిక్కుడు అదే విధంగా సాధారణ చికుడు లో ఉండే గింజల్లో ప్రోటీన్లు అత్యధికంగా లభిస్తాయి. సాధారణంగా ఆకు చిక్కుడుగా పిలవబడే చిక్కుడు గింజల్లో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. చిక్కుడుకాయలను కూర రూపంలో కూడా చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా గోరుచిక్కుడు గింజలను మీ ఆహారంలో భాగస్వామ్యం చేసుకున్నట్లయితే మీకు అత్యధిక శాతంలో ప్రోటీన్లు లభిస్తాయి. 100 గ్రాముల చిక్కుడు గింజల్లో సుమారు 22 గ్రాముల ప్రోటీన్ మీకు లభిస్తుంది.

సోయా గింజలు:

సోయా గింజల్లో కూడా ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. సోయాతో తయారుచేసిన అనేక రకాల ఉత్పత్తుల్లో కూడా మీకు ప్రోటీన్లు లభిస్తాయి. 100 గ్రాములు 20 గ్రాముల సోయా ప్రోటీన్ మీకు లభిస్తుంది. ఇది అత్యుత్తమమైన ప్లాంట్ బేసిడ్ ప్రోటీన్ అందుకే సోయా గింజల నుంచి పాలను కూడా సేకరిస్తారు. వీటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్