ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. ఎండ, వర్షం లేదా వాతావరణం ఏదైనా కావచ్చు. రోజూ టీ తాగడం అనేది కంపల్సరీ. అయితే చల్లటి టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. ఎండ, వర్షం లేదా వాతావరణం ఏదైనా కావచ్చు. రోజూ టీ తాగడం అనేది కంపల్సరీ. అయితే చల్లటి టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. టీ మిగిలిపోయినప్పుడు దాన్ని పదే పదే వేడి చేసి తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రుచి, వాసనలో మార్పు
టీని పదే పదే మళ్లీ వేడి చేయడం వల్ల టీ అసలు రుచిని కోల్పోతుంది లేదా ఒక రకమైన కొత్త వాసనను సృష్టిస్తుంది. ఎందుకంటే టీలోని సున్నితమైన సుగంధ సమ్మేళనాలు అన్ని కోల్పోతాయి. టీలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి వివిధ ప్రయోజనకరమైన రసాయనాలు ఉంటాయి. టీని పదే పదే వేడి చేసినప్పుడు యాంటీఆక్సిడెంట్ నష్టం సంభవిస్తుంది, మళ్లీ వేడి చేసే ప్రక్రియ యాంటీఆక్సిడెంట్లు సహా ఇతర ప్రయోజనకరమైన మూలకాలు పనిచేయకుండా పోతాయి.
బాక్టీరియా పెరుగుదల
టీ ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే, అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. మళ్లీ వేడి చేసినప్పటికీ అందులోని బ్యాక్టీరియా నశించదు. ముఖ్యంగా టీని సరిగ్గా నిల్వ చేయకపోతే. మీరు దానిని తరువాత ఉపయోగించాలని అనుకుంటే టీని ఫ్రిజ్‌లో ఉంచడం ఉత్తమమైన మార్గం.
హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి…
కొన్ని సందర్భాల్లో టీని పలు మార్లు వేడి చేయడం వల్ల హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. అయితే తప్పని పరిస్థితుల్లో తక్కువ హీట్ వద్ద కొన్ని పాలు యాడ్ చేసి టీీని వేడి చేయవచ్చు.
టీని చాలాసార్లు వేడి చేయడం వల్ల దాని నాణ్యత మరింత దిగజారుతుంది. మీరు త్రాగాలి అనుకున్నప్పుడు, ఫ్రెష్ గా మళ్లీ పెట్టుకొని తాగండి. మీకు టైం లేదు అనుకుంటే టీ బ్యాగ్స్ ద్వారా టీ తయారు చేసుకోవచ్చు. ఇందులో వేడి పాలల్లో మీరు టీ బ్యాగ్ వేస్తే సరిపోతుంది. అప్పుడు టీ బ్యాగ్ లోని పొడి ద్వారా మీరు టీ తయారు చేసుకోవచ్చు. టీలోని పలు రసాయనాలు పదే పదే వేడిచేయడం ద్వారా తమ నాణ్యతను కోల్పోయి, టాక్సిన్లుగా మారతాయి. తద్వారా ఇవి విష పూరితంగా సైతం మారే అవకాశం ఉంది. అయితే మీరు టీ తాగడం వ్యసనంగా మారినప్పుడు గ్రీన్ టీ తాగడం అనేది ఒక ప్రత్యామ్నాయం.