మన శరీరంలో వడపోత కోసం పనిచేసే అవయవాల్లో కిడ్నీ ఒకటి. రక్తాన్ని శుభ్రం చేసేందుకు సహాయపడే అవయవం కిడ్నీ. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే కొన్ని హెల్తీ డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. మనిషి శారీరక ఆరోగ్యాన్ని కాపాడటంలో కిడ్నీల పాత్ర కూడా చాలా పెద్దది. మన శరీరంలోని అవాంఛిత వ్యర్థాలను తొలగించి రక్తంను శుభ్రం చేస్తుంటాయి. కానీ కొందరికి వివిధ కారణాల వల్ల కిడ్నీలు పాడవుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు వస్తుంటాయి. దీని కారణంగా, మన శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోతాయి. మూత్రపిండాలు తమ పని కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి ఈ క్రింది సహజ పానీయాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
గ్రీన్ టీ:
కిడ్నీ ఆరోగ్యానికి గ్రీన్ టీ అద్భుతమైనదని ఇప్పటికే నిరూపితమైంది. ఎందుకంటే ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల కిడ్నీ వాపు, దెబ్బతినకుండా చేస్తుంది. అదనంగా, గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్-3-గాలేట్ ఉంటుంది.ఇది చర్మ కణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్రీన్ టీ కిడ్నీలో రాళ్ల సమస్యను కూడా దూరం చేస్తుంది.
పండ్ల రసాలు, స్మూతీస్:
అవోకాడోస్, సిట్రస్ పండ్లు, పీచెస్, ఫ్రోజెన్ బ్లూబెర్రీస్, పుచ్చకాయలు విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో మాత్రమే కాకుండా, మన బ్లడ్ లో ఉండే చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి మీరు ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ లేదా స్మూతీ తాగడం అలవాటు చేసుకుంటే అది మీ కిడ్నీకి చాలా మంచిది.
బ్లాక్ కాఫీ:
గ్రీన్ టీ లాగానే బ్లాక్ కాఫీ కూడా కిడ్నీ ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల రాబోయే రోజుల్లో అదనపు కిడ్నీ సమస్యలను నివారించవచ్చు.ఎందుకంటే కాఫీలోని కెఫిన్ కంటెంట్, ఇది యాంటీఆక్సిడెంట్ కూడా, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అయితే దీన్ని మితంగా తీసుకోవాలి.