ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరి జుట్టు కూడా ఊడిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిలు జుట్టు ఊడిపోయినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీ జుట్టుకు సంబంధించిన అంతవరకు సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరి జుట్టు కూడా ఊడిపోతుంది. ముఖ్యంగా అమ్మాయిలు జుట్టు ఊడిపోయినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీ జుట్టుకు సంబంధించిన అంతవరకు సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అప్పుడే మీ జుట్టు ఊడకుండా పాటిష్టంగా ఉంటుంది.ఇందుకోసం బయట దొరికే షాంపూల కన్నా కూడా ఇంట్లోనే మీరు శుభ్రంగా కొబ్బరి నూనెతో కలిపి చేసుకోగలిగే ఐదు రకాల హెర్బల్ ఆయిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మందార తైలం:
ముందుగా ఒక బాణలిలో కొబ్బరి నూనె వేసి ఆ తర్వాత అందులో ఎర్రటి ముద్దమందారం పువ్వులను వేసి మరగబెట్టాలి. ఆ తర్వాత ఈ నూనె చల్లారిన అనంతరం అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి మీ తలకు వాడినట్లయితే జుట్టు కుదుళ్ల నుంచి బలపడుతుంది.
కరివేపాకు తైలం:
ముందుగా ఒక బాణలిలో కొబ్బరి నూనె వేసి దాన్ని మరిగించాలి. ఆ తర్వాత అందులో కరివేపాకులు వేసి మరగబెట్టాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెను చల్లారిన తర్వాత అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి మీ తలకు పెట్టుకున్నట్లయితే మీ జుట్టు పటిష్టంగా దృఢంగా మారుతుంది.
మెంతుల తైలం:
ముందుగా ఒక బాణలిలో కొబ్బరి నూనె పోసి ఆ తర్వాత అందులో మెంతి పొడి వేయాలి. నూనె మరిగిన తర్వాత అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి వడకట్టుకున్న తర్వాత సీసాలో భద్రపరచుకొని తలకు రాసుకుంటే చాలా మంచిది.
అశ్వగంధ తైలం:
అశ్వగంధ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక బాణలిలో కొబ్బరి నూనె పోసి మరగబెట్టాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా వేయాలి. ఆ తర్వాత చల్లారిన అనంతరం వడకట్టి అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి తలకు పెట్టుకున్నట్లయితే మీ జుట్టు దృఢంగా మారుతుంది.
అలోవెరా తైలం:
ముందుగా కొబ్బరినూనెను మరగబెట్టి ఆ తర్వాత అందులో అలోవెరా ముక్కలను వేయాల్సి ఉంటుంది. ఇవి మరిగిన అనంతరం కొబ్బరి నూనెను చల్లార్చి వడగట్టి ఒక సీసాలో పోసుకొని రెగ్యులర్గా మీ తలకు పట్టించినట్లయితే మీ జుట్టు ఊడిపోకుండా పటిష్టంగా ఉంటుంది.