లివర్ ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు ఇవే.. కాలేయాన్ని కాపాడుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే.!

శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో లివర్ ఒకటి. శరీరంలో చర్మం తర్వాత కాలేయం అతి పెద్ద అవయవం. ఇది శరీరంలో కుడి వైపున పై భాగంలో పక్కటెముకు కింద ఉంటుంది. శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా కాలేయం పనిచేస్తుంది. అయితే కొన్ని రకాల కారణాలవల్ల కాలేయం దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి పుట్టుకతో జన్యుపరమైన కారణాలవల్ల కాలేయ సమస్యలు వస్తుంటాయి.

Liver organs

 కాలేయం

శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో లివర్ ఒకటి. శరీరంలో చర్మం తర్వాత కాలేయం అతి పెద్ద అవయవం. ఇది శరీరంలో కుడి వైపున పై భాగంలో పక్కటెముకు కింద ఉంటుంది. శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా కాలేయం పనిచేస్తుంది. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కాలేయం ఆహార పదార్థాలు, గాలి, నీరు ద్వారా శరీరంలోకి వచ్చే కొన్ని రకాల విషవాయువులను తొలగిస్తుంది. శరీరం పనితీరుకు అవసరమైన అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. శరీరం శక్తి నిలువ అయిన గ్లైకోజన్, చక్కెరలో కాలేయంలోనే నిల్వ చేయబడతాయి. శరీరంలో ఏర్పడే కొవ్వును జీర్ణం చేయడానికి ఉపయోగపడే పిత్తాన్ని తయారు చేస్తుంది. గాయం అయినప్పుడు రక్తం గడ్డ కట్టించే ప్రోటీన్లు త్రోమిన్లు సైతం కాలేయం ఉత్పత్తి చేస్తుంది. రక్త ప్లాస్మా కోసం ప్రోటీన్ తయారు చేయడం, జీర్ణక్రియలో సహాయ పడడం వంటి ప్రక్రియను కాలేయం పూర్తి చేస్తుంది. అయితే కొన్ని రకాల కారణాలవల్ల కాలేయం దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి పుట్టుకతో జన్యుపరమైన కారణాలవల్ల కాలేయ సమస్యలు వస్తుంటాయి. హెపటైటి ఏ, బి, సీ వైరల్ ఇన్ఫెక్షన్, కలుషితమైన ఆహారం, నీరు కారణంగా కాలేయం పాడవుతుంది. ఫాస్ట్ ఫుడ్, చక్కెర సంబంధిత ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, టైప్-2 మధుమేహం కూడా కాలేయ సమస్యకు కారణం కావచ్చు. ఒత్తిడి కాలేయ పనితీరు మందికించేలా చేస్తుంది. మద్యపానం, ధూమపానంలో ఉండే కొన్ని రసాయనాలు కాలేయంలో చేరడంతో కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. 

ఇది లక్షణాలు..

కాలేయం పనితీరు మందగించినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా బరువు తగ్గడం, కామెర్లు రావడం, జ్వరం వస్తూ ఉండడం, వికారం, వాంతులు అవ్వడం, మాత్రం, మలం రంగులో మార్పు రావడం, నోటి దుర్వాసన, పదేపదే కడుపులో నొప్పి రావడం, కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారడం, చర్మంపై దురదలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని నిపుణులు చూపిస్తున్నారు. 

నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..

కాలేయ సంబంధిత సమస్యలను నివారించేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం, తక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం మంచిది. గాలి, దుమ్ము కలుషిత నీటితో వచ్చే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరుపు రంగు మాంసాలకు దూరంగా ఉండాలి. నీటిని అధికంగా తాగుతూ ఉండాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండాలి కాలే సమస్యలు ఉన్నవారు ఉప్పు పరిమాణాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలకు చెక్ చెప్పవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్