జీకా వైరస్ కలకలం..వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే

వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.అందుకే వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు దేశంలో జీకా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి. నివారణ చర్యలు ఏంటి. తెలుసుకుందాం.

mosquito

ప్రతీకాత్మక చిత్రం 

వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే  ప్రెజెంట్ జీకా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. పూణెలో పది రోజుల్లోనే 6 కేసులు నమోదు అయ్యాయి. అందులో భాగంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జికా వైరస్‌ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్  శిశువు, గర్భిణీ స్త్రీని ప్రభావితం చేస్తుంది.జికా వైరస్ సంక్రమణ లక్షణాలు చాలా తేలికపాటివి. ఈ కారణంగా, గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జికా వైరస్ పిండం, తల్లిపై ప్రభావం చూపుతుంది. Zika వైరస్ సోకిన దోమలు Aedes aegypti, albopictus కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమ పగటిపూట లేదా రాత్రిపూట ప్రకాశవంతమైన కాంతి ఉన్న చోట కూడా కుడుతుంది. వైరస్ సోకిన తల్లి నుండి పిండానికి లైంగిక సంపర్కం, రక్తమార్పిడి లేదా డెలివరీ సమయంలో మావి ద్వారా వ్యాపిస్తుంది. ఈ కారణంగా, గర్భిణీ స్త్రీకి మొదటి మూడు నెలల్లో అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 

జికా వైరస్ లక్షణాలు:

జికా వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఇన్ఫెక్షన్ లక్షణాలు లేవు. కానీ ఎవరైనా జ్వరం, చర్మంపై దద్దుర్లు లేదా కీళ్ళు, కండరాలలో నొప్పి, తలనొప్పి లేదా కళ్ళు ఎర్రబడటం లేదా కండ్లకలక వంటి వాటిని అనుభవిస్తే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు సోకిన దోమ కుట్టిన ఒక వారం తర్వాత కనిపిస్తాయి. ఆ తర్వాత దాదాపు ఒక వారం వరకు ఉండవచ్చు.

యుఎస్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం , గర్భిణీ స్త్రీలలో జికా ఇన్‌ఫెక్షన్ శిశువు మెదడుకు సంబంధించిన మైక్రోసెఫాలీ, పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుందని పేర్కొంది. ఈ స్థితిలో పుట్టిన పిల్లల తల చిన్నదిగా ఉంటుంది. అలాగే కళ్లు బలహీనంగా మారతాయి. కీళ్లలో నొప్పి, న్యూరాన్ల లోపం మెదడులోని హైపర్టోనియా వంటి సమస్యలు ఉంటాయి. 

జికాకు పరిష్కారం ఏమిటి? 

దోమలకు దూరంగా ఉండడం, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు యాంటీ మస్కిటో క్రీమ్ రాసుకోవడం, దోమతెరలు ఉపయోగించడం మొదటి జాగ్రత్త. గర్భిణీ స్త్రీలలో జికా లక్షణాలు కనిపిస్తే రక్తం లేదా మూత్రం యొక్క RT-PCR పరీక్ష అవసరం. జికా వైరస్‌కు యాంటీవైరల్ చికిత్స లేదు. అయితే దీనికి వైద్యులు కచ్చితంగా మందులు ఇస్తారు. గర్భిణీ స్త్రీలు ఈ రోజుల్లో విశ్రాంతి తీసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్