ముడతలు తొలగించి స్కిన్ గ్లో పెంచే హోం రెమెడీస్ ఇవే

ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఫేస్ ప్యాక్ లు ఏవో చూద్దామా?

BEAUTY CARE
ప్రతీకాత్మక  చిత్రం 

ఎంత వయసు వచ్చినా.. చాలా యంగ్ గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కొంతమందికి చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు వస్తుంటాయి. బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోవడం వల్ల చర్మం దెబ్బతిని ముడతలు ఏర్పడతాయి. దీనికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా సహజంగా చర్మ సౌందర్యాన్ని పెంచి..ముఖంపై ముడతలను పోగొట్టుకోవాలని కొందరు అనుకుంటారు. అయితే మన ఇంట్లోనే అందుబాటులో ఉన్న వస్తువులతో సహాజ అందాన్ని పొందవచ్చు. అవేంటో చూద్దాం. 

నిమ్మరసం:

నిమ్మరసం చర్మంలోని ముడతలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇందులో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే  బ్లీచింగ్ గుణాలు మచ్చలను, ముడతలను తొలగిస్తాయి. నిమ్మకాయ నుండి రసాన్ని పిండుకుని చర్మానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం, ఒక చెంచా నిమ్మరసానికి అర చెంచా  క్రీమ్, ఒక చెంచా గుడ్డులోని తెల్లసొన కలపండి. అన్నింటినీ సరిగ్గా మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

అరటి మాస్క్: 

అరటి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.ఇందులో ఉండే విటమిన్ ఎ డార్క్ స్పాట్‌లను తొలగించి.. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. అరటిపండు చర్మ కణజాలాలను హైడ్రేట్ చేస్తుంది. గుజ్జు చేసిన అరటిపండును చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి పాలు:

మీ చర్మానికి మాయిశ్చరైజర్ అవసరమైతే, మీరు మీ చర్మంపై కొబ్బరి పాలను రాసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన కొబ్బరి పాలను ఉపయోగించండి. కొబ్బరిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి..చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా  మార్చుతాయి.కొబ్బరి  పాలను మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత వేడి నీటితో కడగాలి.

బొప్పాయి మాస్క్:

బొప్పాయి చర్మానికి అద్భుతాలు చేస్తుంది.స్కిన్ గ్లోయింగ్ కావాలంటే కచ్చితంగా బొప్పాయిని వాడాలి.బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,చర్మానికి మేలు చేస్తుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైమ్ చర్మం ఉపరితలంపై ఉన్న మృతకణాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని దృఢంగా,మరింత సాగేలా చేస్తుంది. పండిన బొప్పాయిని కోసి దాని ముక్కలతో పేస్ట్‌లా చేసుకోవాలి.దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్