మీ మెదడు షార్ప్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవాలి. అవేంటో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
మెదడు చాలా షార్ప్‌గా పనిచేయాలని ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే మనం తినే ఆహారం కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుందని చాలా మందికి తెలియదు.అవును, మనం తినే ఆహారం మన మెదడు పనితీరుకు పదును పెట్టగలదు. ముఖ్యంగా ఇంట్లోనే తయారుచేసుకుని తినగలిగే ఆహారం చాలా మంచిది. రెస్టారెంట్ ఫుడ్‌లో సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు, ఇతర ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. అధిక సోడియం వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.మెదడు షార్ప్ గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు:
కాలే, బచ్చలికూర, బ్రోకలీ, ఉల్లిపాయలు మొదలైన ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అయిన విటమిన్ కె, లుటిన్, ఫోలేట్ బీటా కెరోటిన్‌లను అందిస్తాయి. శాకాహారం ఎక్కువగా తినడం వల్ల అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు. అలాగే, దృష్టి, మానసిక దృక్పథం, మానసిక స్థితి, భావోద్వేగం మెరుగుపడతాయి. ఇది స్ట్రోక్స్, ఇతర హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
పాలు, బాదం:
బాదంపప్పులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ప్రోటీన్లు కూడా ఉన్నాయి. ఇది మెదడు కణజాలానికి హానిని నిరోధిస్తుంది. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటుంది. పాలలో విటమిన్ డి, క్యాల్షియం, ప్రొటీన్లు ఉంటాయి. పాలు, బాదం పప్పులను కలిపి తీసుకుంటే, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గుడ్లు, కూరగాయలు:
గుడ్లలో విటమిన్ B6, విటమిన్ B12, ఫోలేట్, కోలిన్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తికి మేలు చేస్తాయి. కోలిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మెదడును పదునుపెడుతుంది. మీ ఆహారంలో యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే కూరగాయలను జోడించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలానికి మంచిది.
పసుపు,నల్ల మిరియాలు:
భారతీయులు తమ వంటలలో మిరియాలు ఉపయోగించని వారు చాలా అరుదు. ఇందులో రకరకాల ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. మిరియాలు ఆహారానికి రుచి, రంగును ఇస్తుంది. మిరియాలు మెదడు శక్తిని పెంచుతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ కంటెంట్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రుచిని మించిన మిశ్రమం. మిరియాలలో ఉండే పైపెరిన్ కంటెంట్ ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.