Dragon Fruit Facts : డ్రాగన్ ఫ్రూట్‌‌ గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే..

దక్షిణ అమెరికాలో ఎక్కువగా పండే డ్రాగన్ ఫ్రూట్‌‌‌.. ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా సాగు చేస్తున్నారు. ఈ పండు ప్రయోజనాల్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణలో దీరి సాగుకు కృషి చేసింది. అసలు ఆ పండుకు డ్రాగన్ అని పేరు ఎలా వచ్చింది? ఆ పండు ఎందుకు తినాలి? రెడ్ కలర్‌లో ఉండే పండు తినాలా? వైట్ కలర్‌లో ఉండే పండు తినాలా? అందులో ఎలాంటి పోషకాలు ఉంటాయి? అనే మరెన్నో విషయాలు తెలుసుకుందాం.

dragon fruits facts

ప్రతీకాత్మక చిత్రం

డ్రాగన్ అని పేరు ఎలా వచ్చింది: డ్రాగన్ ఫ్రూట్‌.. ఈ పేరే చిత్రంగా ఉంటుంది. డ్రాగన్ తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ.. శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెట్టారంటే, వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల వల్లే.

ఈ పండు ఎందుకు తినాలి:  బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. డ్రాగన్ పండ్లలో విటమిన్ C, E పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారతారు. చాలా శక్తి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి.

రెడ్ కలర్‌లో ఉండే పండు తినాలా, వైట్ కలర్‌లో ఉండే పండు తినాలా: షుగర్ ఉన్న పెషేంట్స్‌కి  డ్రాగన్ ఫ్రూట్‌ తినాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. కానీ తెల్ల రంగులో ఉండే డ్రాగన్ ప్రూట్ తినాలా? లేక రెడ్ డ్రాగన్ ప్రూట్ తినాలా? అనేది ఒక చిన్న అనుమానం. అసలు ఏ కలర్‌లో ఉన్న డ్రాగన్ ప్రూట్‌ని తినాలి? రెడ్, వైట్ కలర్‌లో ఉండే రెండు రకాల పండ్లను తినవచ్చా? అంటే.. నార్మల్‌గా 100 గ్రాముల రెడ్ డ్రాగన్ ప్రూట్‌లో 11.5 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 100 గ్రాముల వైట్ డ్రాగన్ ప్రూట్లో 7.6 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. కావున డయాబెటిస్ ఉన్న వాళ్లు వైట్ డ్రాగన్ ప్రూట్‌ని తినటం మంచిది. వెయిట్ లాస్ డైట్ తీసుకునే వారు కుడా వైట్ డ్రాగన్ ప్రూట్‌ని తీసుకొవటం మంచిది. ఎందుకంటే అందులో లెస్ షుగర్ కంటెంట్ ఉంటుంది.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్