చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో విటమిన్ డి పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి.
ప్రతీకాత్మక చిత్రం
సూర్యకాంతి నుండి లభించే విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది మన ఎముకలను బలంగా ఉంచడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే శక్తిని మనకు అందిస్తుంది. కానీ విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే కూడా హానికరం అని మీకు తెలుసా?
అదనపు విటమిన్ డి ఎందుకు ప్రమాదకరం?
చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. కానీ వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో విటమిన్ డి పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి.
ఎముకలు బలహీనంగా మారే ఛాన్స్: విటమిన్ డి తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారుతాయనడం వింతగానే అనిపించినప్పటికీ.. కానీ ఎక్కువ విటమిన్ డి తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారి నొప్పి వస్తుంది.
కిడ్నీ వ్యాధి: అధిక విటమిన్ డి మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
కడుపునొప్పి: వాంతులు, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం.
గుండె జబ్బులు: గుండె కొట్టుకోవడం సక్రమంగా ఉండదు.
మనసులో గందరగోళం: మెదడు సరిగ్గా పనిచేయదు
మీకు విటమిన్ డి ఎక్కువగా ఉంటే ఏమి చేయాలి?
వైద్యుడిని సంప్రదించాలి: మొదట మీరు వైద్యుడిని సంప్రదించాలి.
విటమిన్ డి మాత్రలు తీసుకోవడం మానేయండి: వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు.
ఎండలో తక్కువగా ఉండండి: ఎండలో ఎక్కువగా కూర్చోకూడదు.
ఎక్కువ నీరు త్రాగండి: మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు నీళ్లు, పానీయాలు తీసుకోండి.
విటమిన్ డి సరైన స్థాయిలో ఏ స్థాయిలో ఉండాలి?
విటమిన్ డి సరైన స్థాయి ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కానీ సాధారణంగా 20 నుండి 40 మధ్య స్థాయి సరైనదిగా పరిగణించరు.
వైద్యుని సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు . మీకు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండం మంచిది.