వర్షాకాలంలో తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం
వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలం వర్షాలతోపాటు వ్యాధులను కూడా తీసుకువస్తుంది. ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచే హెర్బల్ టీలతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతుంటారు. మరి వర్షాకాలంలో తులసీ టీ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.
వర్షాకాలం అలర్జీలు:
వర్షాకాలంలో విజృంభించే అలర్జీలు, వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధులు మొదలైనవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో మీ ఆహారంలో హెర్బల్ టీలను చేర్చుకోవడం ఉత్తమ మార్గం.
మూలికల టీ:
మీ ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు,పానీయాలను చేర్చుకోవడం ఉత్తమం. వర్షకాలంలో వేడి వేడి హెల్తీ హెర్బల్ టీ తాగడం మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. వర్షాకాలంలో తులసి టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతుంది. తులసి టీ అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి, వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే హెర్బల్ టీ. మీ ఆరోగ్య సంరక్షణలో తులసి టీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి తులసి టీ గొప్పగా పనిచేస్తుంది.
దగ్గు, జలుబు :
తులసిలోని ముఖ్యమైన నూనెలు ఎక్స్‌పెక్టరెంట్, డీకాంగెస్టెంట్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి వాతావరణ మార్పుల వల్ల వచ్చే రద్దీ, దగ్గు, సైనస్ సమస్యల వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
ఒత్తిడి :
వర్షాకాలంలో, మీ దినచర్యలో మార్పులు వల్ల ఒత్తిడికి గురవుతారు. తులసి టీలో అడాప్టోజెన్ అనే ఒక హెర్బ్ ఉంటుంది.తులసీ టీ తాగినప్పుడు ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే ఒక కప్పు తులసి టీ తాగడం వల్ల మీకు రిలాక్స్‌గా ఉంటుంది. మీకు రిఫ్రెష్‌గా, పునరుజ్జీవనం పొందడంలో సహాయపడుతుంది.
హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్:
వర్షాకాలంలో కూడా హైడ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను కోల్పోయేలా చేస్తుంది. తులసీ టీ హైడ్రేషన్ ,ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. తులసి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వర్షాకాలంలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియా,శిలీంధ్రాల పెరుగుదల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో తులసి టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును పొందడంలో దాని ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు.